నా జీవితంలో ఆ వెలితి ఎప్పటికీ అలాగే ఉంటుంది – ఎన్టీఆర్

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన చేసిన సినిమాలు పోషించిన పాత్రలు ఇప్పటికీ ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులు పూర్తిస్థాయిలో ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు. ఎలాంటి సక్సెస్ అందుకుంటున్నారు అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్న వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇకపోతే వరుస సినిమాలతో బిజీగా ఉన్న వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని చెప్పాలి. లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఈయనకు ఇద్దరు కుమారులు జన్మించారు. అందులో మొదటి కుమారుడు అభయ్ రామ్ కాగా రెండవ కుమారుడు భార్గవ్ రామ్.. ప్రస్తుతం ఈ దంపతులిద్దరూ తమ పిల్లలతో సంతోషంగా ఉన్నారు.

ఎన్టీఆర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఒక వెలితి ఉందని ఇక అది ఈ జన్మకు నెరవేరదు అంటూ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కి మొదటి కుమారుడి జన్మించినప్పుడు ఎంతో సంబరపడ్డారట. ఆ తర్వాత మళ్లీ కొడుకు పుట్టేసరికి ఆయన నిరాశ పడ్డారట. కూతురు పుడుతుందని ఎంతో ఎదురుచూశారట. కానీ రెండవసారి కూడా అబ్బాయి పుట్టడంతో మరి అబ్బాయి పుట్టారని లక్ష్మి ప్రణతి ఏంటి అర్థం ఒక అమ్మాయి పుట్టి ఉండి ఉంటే బాగుండేది అని వాళ్ళు ఇప్పటికి బాధపడుతూ ఉంటారు . జీవితంలో ఎన్ని సుఖసంతోషాలు ఉన్న కూతురు పుట్టలేదన్న బాధ ఎప్పటికీ ఉంటుందని తెలిపాడు.

Share post:

Latest