వామ్మో.. శ్రీలీలా డిమాండ్ మామూలుగా లేదుగా..9 చిత్రాలు లైన్ అప్ లో..!

ప్రముఖ యంగ్ బ్యూటీ శ్రీ లీలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. తన నటనతో,అందంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకుంది. పెళ్లి సందD సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఈమె ఈ సినిమాతో తెలుగులో మరింత పాపులారిటీ దక్కించుకుంది. అయితే కృతి శెట్టి రేంజ్ లో మొదట్లో పాపులారిటీ దక్కించుకోలేదు. కానీ ఇప్పుడు కృతి శెట్టి రేంజ్ పడిపోయింది.. ఇప్పుడు అమాంతం శ్రీ లీలా రేంజ్ పెరిగిపోయిందని చెప్పాలి.

ఇకపోతే ధమాకా సినిమాలో రవితేజ సరసన నటించి భారీ పాపులారిటీ దక్కించుకునే ప్రస్తుతం తన చేతిలో 9 సినిమాలతో మరింత క్రేజ్ దక్కించుకుంటుంది. ఇటీవలే విజయ్ దేవరకొండ చిత్రంలో కూడా భాగమయింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు మరొకవైపు మహేష్ బాబు సినిమాలో కూడా నటిస్తోంది. విజయ్ దేవరకొండ 12వ చిత్రంలో శ్రీ లీల నటిస్తున్నట్లు నిన్న పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. మొత్తానికైతే ఈమె ఇప్పుడు తన చేతిలో 9 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంది.

విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఖుషి సినిమాలో సమంతతో కలిసి నటిస్తున్నారు.. ఇప్పటికే సినిమా నుంచి పోస్టర్లను విడుదల చేయగా పోస్టర్లపై మంచి రెస్పాన్స్ లభించింది. మరొకవైపు ఈ సినిమా పూర్తి చేసి తన 12వ చిత్రాన్ని కూడా త్వరగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తున్నారు విజయ్ దేవరకొండ. మొత్తానికైతే శ్రీ లీల అటు యంగ్ హీరోలను ఇటు సీనియర్ హీరోలను కూడా లైన్లో పెట్టి వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాదు అందుకు తగ్గట్టుగా రెమ్యునరేషన్ పెంచుతోందని సమాచారం.

 

Share post:

Latest