సంపాదించిందంతా అలానే పోయింది.. మనోబాల మృతికి అస‌లు కార‌ణం తెలుసా?

ప్ర‌ముఖ హాస్య న‌టుడు, దర్శకుడు మ‌నోబాల మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈయ‌న మ‌ర‌ణ వార్త త‌మిళ సినీ ప‌రిశ్ర‌మను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. భారతీరాజా తెర‌కెక్కించిన‌ ‘పుతియ వార్పుగల్‌’ సినిమాతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన మ‌నోబాల‌.. ఆ త‌ర్వాత న‌టుడిగా మారాడు. 2003 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు న‌టుడిగా 450 సినిమాల్లో న‌టించి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు.

`నాన్‌ ఉంగల్‌ రసిగన్‌`, `పిల్లై నిలా` అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించాయి. దాంతో దర్శకుడిగానూ ఎన్నో చిత్రాల‌ను తెర‌కెక్కించారు. పలు సీరియల్స్ కు కూడా మనోబాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా మంచి పేరు సంపాదించుకున్న ఆయ‌న మే3న మధ్యాహ్నం కన్నుమూశారు. అయితే మనోబాల మృతికి సిగరెట్స్ ఎక్కువగా తాగడమే అని తెలుస్తోంది.

రోజుకు దాదాపు వంద నుంచి రెండు వంద‌ల సిగరెట్స్ తాగేవాడిన‌ని.. దాంతో త‌న లివ‌ర్ దెబ్బతిందని గ‌తంలో ఆయ‌న స్వ‌యంగా వెల్ల‌డించారు. సంపాదించిందంతా తన చికిత్స కోసమే ఉపయోగించానని.. సిగరెట్స్ ఎక్కువగా తాగడం వల్ల చనిపోతానని తనకు ముందే వైద్యులు చెప్పారని గతంలో తెలిపారు మనోబాల. ఇక జనవరిలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయ‌న‌.. అప్ప‌టి నుంచి చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. అయినాస‌రే ఆయ‌న ఆరోగ్యం మెరుగుప‌డ‌లేదు. ఇక బుధ‌వారం ఆరోగ్యం మ‌రింత విష‌మించి మ‌నోబాల తుది శ్వాస విడిచారు.