హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స‌మంత సంద‌డి.. ఆమె వేసుకున్న‌ చెప్పుల ధ‌ర తెలిస్తే మైండ్ బ్లాకే!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత నాగ‌చైత‌న్య‌కు దూరం అయిన ద‌గ్గ‌ర నుంచి కెరీర్ ప‌రంగా మ‌రింత జోరు చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాగే ఇటీవ‌ల త‌న ల‌గ్జ‌రీ లైఫ్ స్టైల్ తో కూడా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. తాజాగా కాస్ట్లీ చెప్పుల‌తో వార్త‌ల్లో నిలిచింది.

ఆదివారం హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స‌మంత సంద‌డి చేసింది. వైట్ పాంట్‌, బ్లాక్ టాప్‌తో ధ‌రించి స‌మంత.. ఓ జాకెట్‌ను న‌డుముకు క‌ట్టుకొని స్టైలిష్ లుక్‌లో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అయితే ఈ స‌మ‌యంలో స‌మంత వేసుకున్న చెప్పులు అంద‌రినీ ఎట్రాక్ట్ చేశాయి. లూయిస్ విట్టోన్ కంపెనీకి చెందిన బ్రాండెడ్ చెప్పుల‌వి.

వాటిని పూల్ స్లైడర్స్ అంటారు. అయితే ఈ చెప్పుల ధ‌ర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే, స‌మంత ధ‌రించిన‌ ఈ చెప్పుల కాస్ట్ దాదాపు 2500 డాల‌ర్లు. మ‌న ఇండియ‌న్ క‌రెన్సీలో రెండు ల‌క్ష‌ల ఆరు వేలకు పైమాటే అంటున్నారు. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. కాళ్ల‌కు వేసుకునే చెప్పుల కోసం స‌మంత రెండున్న‌ర ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టిందా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. స‌మంత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి `ఖుషి` సినిమాలో న‌టిస్తోంది. బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. మ‌రికొన్ని ప్రాజెక్ట్ లు సైతం ఆమె చేతిలో ఉన్నాయి.