రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కెరటం అనే సినిమా ద్వారా అడుగుపెట్టి ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఓవర్ నైట్ లోనే పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా చలామణి అవుతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో అవకాశాలు తగ్గుతున్న సమయంలో.. ఉన్నట్టుండి బాలీవుడ్ కి మకాం మార్చింది. ఆ తర్వాత అక్కడ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె బాలీవుడ్లో నెట్టుకు రావాలి అంటే గ్లామర్ షో చేయాల్సిందే అని తెలుసుకుందో ఏమో కానీ అప్పటినుంచి రకరకాల ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది.
బికినీని తలపించేలా దుస్తులు ధరించి జీరో ఫిగర్ మెయింటైన్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది. అంతేకాదు సొంతంగా జిమ్ వ్యాపారం మొదలుపెట్టిన ఈమె ఆ జిమ్ సెంటర్లో తన బాడీని విల్లులా వంచుతూ చేసే విన్యాసాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. నిత్యం జిమ్ సెంటర్లో ఉంటూ తన ఫిగర్ ను మరింత మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ ముద్దుగుమ్మ టైట్ ఫిట్ దుస్తులతో తన అందాలను మొత్తం పరిచేస్తూ ఉంటుంది. ఇక ఈమె అందాలకు నేటిజన్లు సైతం మోహితులు అవుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి చీరకట్టులో జీరో ఫిగర్ చూపిస్తూ అందరిని మెస్మరైజ్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఎల్లో కలర్ చీర ధరించి స్లీవ్ లెస్ బ్లౌజ్ తో ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూనే పర్ఫెక్ట్ ఫిగర్ చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. రకుల్ అందాలు చూసి సెలబ్రిటీలు కూడా మైమరిచిపోతున్నారనే చెప్పాలి.. ఇక ఇంత అందం మాత్రమే కాదు అంతకుమించి టాలెంట్ తో సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళిన రకుల్ ప్రీత్ సింగ్ అభిమాని కోసం అక్కడ అతనితో కలిసి సెల్ఫీ దిగి మరొకసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా రకుల్ ప్రీత్ పై ప్రశంసల కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె మళ్ళీ తెలుగులో రీఎంట్రీ ఇస్తే బాగుండు అని అభిమానుల సైతం కోరుకుంటున్నారు.
@Rakulpreet Hello rakul preet mam iam trying to contact but after today's conversation but i couldn't Today we could talk properly, mam , thank you mam to give hope that still there is chance to travel with you , to work with you 💞 i hope you will contact me 🥹 pic.twitter.com/pxJD7wlS9C
— Abdul Naveed (@AbdulNaveed7093) April 30, 2023