మరోసారి అందాలన్నీ బయటపెట్టిన శ్రియ.. పిక్స్ వైరల్!

నటి శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇష్టం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తరువాత ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించింది. దాదాపు ఇరవై ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతుంది. ప్రస్తుతం పెళ్లిచేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చి మదర్‌హుడ్‌ను ఆస్వాదిస్తుంది. తల్లి అయిన తరువాత కూడా గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. గ్లామరస్ ఫొటోషూట్స్‌తో ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.

ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా అన్ని సౌత్ ఇండియా సినిమాల్లో తన సత్తా చాటుకుంది. ఇక టాలీవుడ్ సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోలందరితో నటించించింది. శ్రీయ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో పాటుగా పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే గత ఏడాది రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అజయ్ దేవగణ్ కి భార్యగా నటించింది. ఆ తరువాత దృశ్యం-2లో మెరిసింది.

ఈ అమ్మడు సినిమాలోకి అడుగుపెట్టినప్పుడు ఎంత అందంగా ఉందో ఇప్పటికీ అదే గ్లామర్ ని మెయింటైన్ చేస్తుంది. ఈ అమ్మడు అందానికి రహస్యం ఏంటంటే ఆమె ఎక్కువగా హోమ్ రెమిడీస్ ని ఫాలో అవుతూ ఉంటుందట. వాటి కారణంగానే ఆమె అందం రోజురోజుకీ పెరిగిపోతుందని శ్రియా చెప్తుంది.

ఈ అందాల భామ ఇటీవలే తన భర్త ఆండ్రూతో కలిసి ఇండియాకి వచ్చింది. వచ్చి రాగానే తన అభిరుచులకి తగ్గటుగా కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకుంది. ముంబైలోని కాస్ట్లీ ఏరియా బాంద్రాలోని కొత్త ఇంట్లోకి వెళ్లిందని బాలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి.

Share post:

Latest