నితిన్ హీరోయిన్ పరిస్థితి ఘోరం.. చివరికి బుల్లితెర స్థాయికి పతనం??

ప్రముఖ నటి సదా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించిన ఈ భామ ఈ మధ్య సినిమాలలో కనిపించడం మానేసింది. సినిమాలలో కనిపించకపోయినా బుల్లితెర ప్రోగ్రామ్స్‌లో జడ్జిగా అందరినీ అల్లరిస్తూనే ఉందని అభిమానులు సంతోషించారు. కానీ ఈ మధ్య బుల్లితెరపై కూడా పెద్దగా కనిపించడం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో జడ్జిగా రెండు సీజన్స్‌లో అలరించి వెళ్ళిపోయింది.

ఢీ షో తరువాత 2-3 సినిమాలలో నటించిన సదా మళ్లీ మల్లెమాల టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. జబర్దస్త్ కామెడీషోలో ఒకప్పుడు నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించారు. ఆ తరువాత చాలా మంది జడ్జిలు మారుతూ వస్తున్నారు. ప్రస్తుతమైతే జబర్దస్త్ జడ్జ్‌లుగా కృష్ణ భగవాన్, ఇంద్రజ ఉన్నారు. కనీసం వీరిద్దరూ అయిన ఫిక్స్ అవుతారేమో అనుకుంటే అప్పుడప్పుడు ఇంద్రజ బదులుగా ఖుష్బు ప్రత్యక్షమవుతూ ఉంటుంది.

కాబట్టి ఇంద్రజల వచ్చి వెళ్లే జడ్జి కాకుండా సదాని ఫుల్ టైమ్స్ జడ్జిగా ఫిక్స్ చెయ్యాలని మల్లేమాల టీమ్ అనుకుంటున్నారట. లేటెస్ట్ గా విడుదల అయిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ ప్రోమోలో సదాకి గ్రాండ్ కి వెల్కమ్ చెప్పారు. ఎలాగో మేల్ జడ్జి గా కృష్ణ భగవాన్ ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఫీమేల్ జడ్జిగా సదాని ఫిక్స్ చేసారు. ఇక ఇటీవలే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో కొత్త టీమ్స్ కూడా సందడి చేయడం మొదలు పెట్టాయి. ఇదంతా చూస్తుంటే మల్లెమాల వారు సరికొత్తగా ఆడియన్స్ ని అలరించడానికి వచ్చినట్లు అర్ధం అవుతుంది.

Share post:

Latest