కమెడియన్లకు మళ్లీ జబర్దస్త్ షో దిక్కేనా..?

తెలుగు రాష్ట్రాలలో జబర్దస్త్ కామెడీ షో తెలియని వారంటూ ఎవరు ఉండరు. గత కొన్ని లుగా ఈ షో ప్రసారం అవుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తూ ఎంతోమంది కమెడియన్లకు కూడా జబర్దస్త్ లైవ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇలా జబర్దస్త్ షో నుంచి సినీ ఇండస్ట్రీలోకి కమెడియన్లుగా ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో సుడిగాలి సుదీర్, షకలక శంకర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, వేణు వండర్స్ ఇలా ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్ల ద్వారా గుర్తింపు సంపాదించి వెండితెర పైన అలరిస్తున్నారు.

Shakalaka Shankar Latest Updates, Gallery, Wiki, Affairs, Contact Info,  Biodata, News
ఇదంతా ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో చాలామంది కమెడియన్స్ జబర్దస్త్ ను వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా ఇతర షోలలో చేయడంతో పాటు వెండితెర పైన అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తున్నారు.. అయితే అలా వెళ్ళిపోయిన కొంతమంది కమెడియన్స్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరుగా మళ్లీ జబర్దస్త్ లోకి రియంట్రి ఇవ్వబోతున్నట్లు సమాచారం. గెటప్ శ్రీను, వేణు వండర్స్, ధనరాజ్, షకలక శంకర్ జబర్దస్త్ ను వదిలి వెళ్లడం జరిగింది.

Tollywood Comedian Jabardasth Sudhakar Biography, News, Photos, Videos |  NETTV4U

వేణు వండర్ ధనరాజ్ బాగా క్లిక్ అవ్వగా షకలక శంకర్ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు తాజాగా జబర్దస్త్ షో కి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మధ్య సునామి సుధాకర్ కూడా జబర్దస్త్ షో ని వదిలి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా సుధాకర్ జబర్దస్త్ లోకి నూకరాజు స్కిట్ తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఇలా జబర్దస్త్ షో వదిలి వెళ్ళిపోయిన కమెడియన్లకు మళ్లీ జబర్దస్త్ ఆధారం అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest