ఆ పెద్దాయన నుండి చలపతిరావు నేర్చుకున్నది ఇదేనా..??

తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా మంది ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. హీరోలకు, హీరోయిన్లకు తల్లిదండ్రులుగా చేస్తూ చిరస్థాయిగా నిలిచి పోయారు. అటువంటి వారిలో చలపతిరావు కూడా ఒకరు. ముఖ్యంగా ఆయన నందమూరి కాంపౌండ్‌లో ఎక్కువగా సినిమాలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. ఆయన గత సినిమాలు గురించి తెలుసుకుంటే అంతా ఆశ్చర్యపోతారు.

సినిమాలలో అడపాదడపా కనిపించినా, తొలిసారి ఆయన డైలాగ్ చెప్పే పాత్ర వచ్చింది సీనియర్ ఎన్టీఆర్ సినిమాలోనే. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన కథానాయకుడు సినిమాలో చలపతిరావు తొలిసారి డైలాగ్ చెప్పే పాత్ర దక్కించుకున్నారు. తర్వాత ఆయన దశ తిరిగిపోయింది. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఎన్నో సినిమాలలో ఆయన నటించారు. అద్భుతమైన నటనను కనబర్చి ప్రేక్షకుల మెప్పు పొందారు.

చలపతిరావు నటుడిగా నిలదొక్కుకోవడంలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎనలేనిది. ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక చిత్రాలలో నటించారు. అందులో ఆయనకు బాగా పేరు తెచ్చి పెట్టిన సినిమాగా దాన వీర శూర కర్ణ సినిమాను అందరూ చెబుతుంటారు. అందులో చలపతిరావు ఏకంగా ఐదు పాత్రలను పోషించాడు. ఇంద్రునిగా, సూతునిగా, ధృష్టద్యుమ్నునిగా, జరాసంధునిగా, బ్రాహ్మణునిగా ఇలా ఐదు విభిన్న పాత్రలలో ఆయన నటించారు. ఆ సమయంలో తాను ఐదు పాత్రలు చేస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందేమోననే సందేహం ఎన్టీఆర్ వద్ద చలపతిరావు వెలిబుచ్చారట. దానికి తాను దేశంలో అందరికీ తెలియకపోవచ్చని, మీరు ఎంత బ్రదర్ అంటూ సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చారు ఎన్టీఆర్. దీనికి ఆశ్చర్యపోవడం చలపతిరావు వంతు అయింది. అశేష అభిమానులు ఉన్న ఎన్టీఆర్ అంటే దేశంలో తెలియని వారు కూడా కొందరు ఉంటారనే విషయాన్ని తెలుసుకున్నారు. గొప్పలకు పోకూడదని, కళామతల్లిని నమ్ముకుని ముందుకు సాగాలనే ఎన్టీఆర్ సందేశాన్ని అర్ధం చేసుకున్నారు. ఎన్టీఆర్ స్పూర్తితో సినిమాలలో వరుస పాత్రలను చలపతిరావు దక్కించుకున్నారు. సహాయ నటుడిగా, విలన్ గా, తండ్రిగా ఇలా ఎన్నో పాత్రలలో ఆయన నటించారు. దురదృష్టవశాత్తూ కొన్నాళ్ల క్రిందట మరణించారు. ఏదేమైనా తెలుగు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు.