దర్శకుడు పూరీ జగన్నాథ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమెడియన్!

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో వున్న ప్రస్తుత దర్శకులలో పూరీ జగన్నాథ్ స్థానం చాలా ప్రత్యేకమైనది. అందుకే అతగాడిని తెలుగు ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖులు కూడా ఇష్టపడుతూ వుంటారు. అతనిపైన దాదాపు ఎవ్వరూ తప్పుగా వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. ఏవో రూమర్స్ ఉంటాయి కానీ, వాటిని ఎవ్వడు పెద్దగా పట్టించుకోడు. అతని సినిమాలంటే పడిచచ్చే జనాలు ఇక్కడ వున్నారు.

అలాంటి పూరీ జగన్నాథ్ పైన ఒకప్పటి కమెడియన్ జోగినాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇపుడు హాట్ టాపిక్ అయింది. కమెడియన్ జోగినాయుడు మీకు గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు ఆయన చాలా సినిమాల్లో నటించారు. కానీ రాను రాను ఆయనకు అవకాశాలు దాదాపుగా తగ్గిపోయాయి. కొత్త కామెడీ రావడంతో ఆయన్ను అంతా దూరం పెట్టేశారు. ఆయన మాత్రం ఏదో ఒక విధంగా ఇండస్ట్రీలో తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. కాగా ఆయనకి గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం వుంది.

యాంకర్ ఝాన్సీని పెళ్లిచేసుకొని ఓ కూతురు పుట్టిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆయన వేరే పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. ఇక తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంలో పూరీ జగన్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పూరి జగన్నాధ్ గురించి జోగినాయుడు మాట్లాడుతూ… “పూరి జగన్నాధ్ నాకు చాలా దగ్గరి బంధవు. ఆ కారణంతోనే నేను ప్రతిసారి ఆయన వద్దకు వెళ్లి ఏదైనా క్యారెక్టర్ ఇవ్వమని అడిగేవాడిని. కానీ ఆయన నాకు అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు కేవలం నాకు ఇడియట్ సినిమాలో మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడు అడిగినా చూద్దాంలే అంటూ దాటవేస్తున్నాడు. ఇక ఆయన మనసులో ఏం ఉద్దేశం ఉందో నాకు తెలియదు.” అంటూ తెలిపాడు జోగినాయుడు.

Share post:

Latest