శివాలెత్తిన శివాత్మిక రాజశేఖర్… మెళికలు తిరుగుతూ ఘాటు ఫోటో షూట్!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ, జీవిత రాజశేఖర్ గారాలపట్టి శివాత్మిక కొంచెం కొంచెంగా గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతోంది. నిన్నమొన్నటి వరకు చాలా పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు రానురాను స్కిన్ షో చేస్తూ తెలుగు కుర్రకారుకి హీటు పుట్టిస్తున్నారు. అవును, తాజాగా శివాత్మిక బోల్డ్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇపుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె రెచ్చిపోయారు. అవును, శివాత్మిక రాజశేఖర్ కొత్త ఇమేజ్ కోరుకుంటున్నారని క్లియర్ గా అర్థం అవుతుంది.

ఓ చీకటి గదిలో క్రేజీ ఫోజులతో ఆమె దిమ్మతిరిగేలా చేశారు. శివాత్మిక లుక్ చూసిన నెటిజెన్స్ విరహవేదనతో రగిలిపోతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఆమె లేటెస్ట్ మూవీ రంగమార్తాండ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో నటించిన పాత్రకుగాను ఆమె మంచి మార్కులే కొట్టేసింది. అయితే కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఓ రకంగా చెప్పాలంటే శివాత్మికకు బ్రేక్ ఇచ్చే మూవీ ఇంకా పడలేదు. హీరో రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయం అయిన సంగతి విదితమే.

2019లో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ ‘దొరసాని’ సినిమా ద్వారా ఆమె హీరోయిన్ గా పరిచయం అయింది. అయితే ఈ సినిమా కమర్షియల్ గా ఆడలేదు. గత ఏడాది శివాత్మిక నటించిన ప్రయోగాత్మక చిత్రం పంచతంత్రం కూడా అంతంతమాత్రమే ఆడింది. అలాగే ఆకాశం టైటిల్ తో విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ కూడా పెద్దిగా ఆడలేదు. కాగా తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. ఏక కాలంలో రెండు పరిశ్రమల్లో శివాత్మిక అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

Share post:

Latest