సౌత్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల జాబితాలో సమంత, సాయి పల్లవి ముందు వరసలో ఉంటారు. తమదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే వీరిద్దరూ స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందే సమంతతో పరిచయం ఉంది.
వీరిద్దరికీ ఓ టీవీ షో ద్వారా కనెక్షన్ కుదిరింది. సాయి పల్లవి మంచి డాన్సర్ అన్న సంగతి అందరికీ తెలుసు. చిన్నతనం నుంచి ఆమె ఎన్నో రియాల్టీ షోస్ లో కూడా పాల్గొంది. అందులో ఢీ డాన్స్ షో ఒకటి. అయితే సమంత తన కెరీర్ ఆరంభంలో ఈ షోకు ముఖ్య అతిథిగా హాజరైంది.
ఆ సమయంలో సాయి పల్లవి కంటెస్టెంట్ గా ఉండటం విశేషం. అంతేకాదు, గెస్ట్ గా హాజరు అయిన సమంత.. ఈ షోలో సాయి పల్లవి డాన్స్ పెర్ఫార్మెన్స్ కు ఫుల్ ఫిదా అయిపోయింది. సాయి పల్లవి డాన్స్ పై పొగడ్తల వర్షం కురిపించింది. `మీరు డాన్స్ చేస్తున్నప్పుడు నా కళ్ళను తిప్పుకోలేకపోయాను సాయి.. అద్భుతంగా చేశారు` అంటూ కొనియాడింది. అందుకు సాయి పల్లవి థ్యాంక్స్ చెప్పింది. ఇందుకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వీడియోలో సాయి పల్లవి, సమంత లుక్స్ గుర్తు పట్టలేనంతగా ఉన్నాయి.
Samantha garu had bee a long term fan of Sai Pallavi ! Doubly love her for that. 🧡🧡🧡 pic.twitter.com/M8jP6cGx5J
— Shallan (@Shallan72) April 7, 2019