బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేస్తున్న `విరూపాక్ష‌`.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందో తెలుసా?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తాజాగా `విరూపాక్ష‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌తో కుమ్మేస్తోంది. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 6 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. రెండో రోజుకు అంత‌కు మించి వ‌సూల్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 5.80 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న విరూపాక్ష‌.. వరల్డ్ వైడ్ గా రూ. 7.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఏరియాల వారీగా విరూపాక్ష 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గమ‌నిస్తే..

నైజాం: 4.53 కోట్లు
సీడెడ్: 1.43 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.33 కోట్లు
తూర్పు: 0.75 కోట్లు
పశ్చిమ: 0.66 కోట్లు
గుంటూరు: 0.81 కోట్లు
కృష్ణ: 0.70 కోట్లు
నెల్లూరు: 0.38 కోట్లు
——————————————–
ఏపీ+తెలంగాణ‌=10.59 కోట్లు(18.20 కోట్లు~ గ్రాస్‌)
——————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 0.85 కోట్లు
ఓవ‌ర్సీస్‌ – 2.21 కోట్లు
—————————————————-
టోటల్ వరల్డ్ వైడ్ = 13.65 కోట్లు(24.60కోట్లు~ గ్రాస్)
—————————————————-

కాగా, రూ. 23 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన విరూపాక్ష‌.. బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే మొద‌టి 2 రోజులు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 9.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.