“నా బ్రతుకు ఎప్పుడు అంతే..ఆరు గంట‌ల దాకానే స్టార్‌ని..” ..సమంత సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా శాకుంతలం . ఒకప్పటి మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న సమంత .. పరసనల్ విషయాలను కూడా అభిమానులతో ఓపన్గా చెప్పుకొస్తుంది .

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సమంత మాట్లాడుతూ..”మా సినిమా ఈ మండు వేసవిలో కుటుంబమంతా కూర్చొని కలిసి ఎంజాయ్ చేసే లా ఉంటుంది.ఇప్పటివరకు నేను చేసిన అన్ని సినిమాలు ఒక ఎత్తు.. శకుంతలం సినిమా మరో ఎత్తు . కచ్చితంగా ఇది జనాలకు బాగా నచ్చుతుంది . గొప్ప గొప్ప కథలు ఎన్నో చూసుంటారు .. వాటిల్లో ఒకటే ఇది ” అంటూ చెప్పుకొచ్చింది .

అంతే కాదు సినిమాలో బరథుడి పాత్రలో నటించిన అల్లుఅర్జున్ కూతురు అర్హా కూడా ఓ రేంజ్ లో నటించింది. అల్లు అర్హ స్వతంత్రురాలు. ఈ వయసులోనే చాలా మైండ్ మెచ్యూర్ ఉంది. తనకి ఏం కావాలో తెలుసు . బన్నీ అవసరం పెద్దగా అర్హా కు ఉండకపోవచ్చు” అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు పాన్ ఇండియా స్టార్ గా మారాక.. మీ పరిస్థితి ఎలా ఉంది..? అని అడగ్గా సమంత ..నవ్వుతూ..” నేను 6 గంటల వరకే స్టార్ ని ..పాన్ ఇండియా హీరోయిన్ ని ..ఆ తర్వాత నా జీవితం మొత్తం సాదాసీదాగా ఉంటుంది. ఇంకా పక్కాగా చెప్పాలంటే నా జంతువులమలాన్ని ఎత్తిపోస్తూ ఉంటాను . అంత సదాసీదా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను. అది నాకు చాలా ఇష్టం ..అలాగే ఉండాలనుకుంటున్నాను ” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే సమంత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!