ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన హవా చూపిస్తున్న చిత్రాలలో దసరా సినిమా ఒకటి. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రంలో మాస్ లెవెల్ లో నటించారు.ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కొత్త దర్శకుడుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.. ఈ సినిమా మూడు రోజుల్లోనే ఏకంగా రూ .70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పైన పలువురు సిని సెలబ్రిటీలతోపాటు అభిమానులు కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇప్పటివరకు నాని నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరొక ఎత్తు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.భారీ విజయాన్ని అందుకున్న ఈ దసరా సినిమాలో నాని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కించారు. తమిళ్, కన్నడ ,మలయాళం, హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతోంది. ఇప్పటివరకు కేవలం తెలుగులో రూ.28 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమాపై మహేష్ బాబు కూడా ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా చూసిన ప్రభాస్ రివ్యూ ఇవ్వడం జరిగింది..
ఇప్పుడే దసరా సినిమా చూశాను తనకు తెగ వచ్చేసిందని సినిమా మొత్తం తాను బాగా ఎంజాయ్ చేశాను అంటూ నానికి కంగ్రాట్యులేషన్స్ చెబుతూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చినట్లు సమాచారం. అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ టేకింగ్ చాలా అద్భుతంగా ఉందంటూ చెప్పుకోచ్చారు.. అలాగే కీర్తి సురేష్ తో పాటు చిత్ర యూనిట్ ని కూడా ప్రశంసించినట్లు తెలుస్తోంది. దసరా సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది..