మౌనిక‌కు మ‌నోజ్ అంత ల‌వ్లీగా ప్ర‌పోజ్ చేశాడా.. నిజంగా గ్రేట్‌!

గ‌త నెల‌లో మంచు మ‌నోజ్, భూమా మౌనిక రెడ్డి పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. మంచు ల‌క్ష్మి నివాసంలో కుటుంబ‌స‌భ్యులు, అతి కొద్ది మంది బంధువుల సమ‌క్షంలో వీరి వివాహం వైభ‌వంగా జ‌రిగింది. మ‌న‌జ్ తో పాటు మౌనికకు ఇది రెండో వివాహ‌మే. పైగా మౌనిక త‌న మొద‌టి భ‌ర్త ద్వారా ఓ బాబుకు జ‌న్మ‌నిచ్చింది.

అయితే మౌనికతో పాటు ఆమె కూమారుడు బాధ్య‌త‌ల‌ను మంచు మ‌నోజ్ తీసుకున్నాడు. ఇక‌పోతే రీసెంట్ గా ఈ నూతన జంట వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `అలా మొద‌లైంది` షోలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ ప్రేమ‌, పెళ్లికి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నాడు. ఇద్ద‌రిలో మొద‌ట ఎవ‌రు ప్ర‌పోజ్ చేశారు..? అన్న వెన్నెల కిషోర్ ప్ర‌శ్నించ‌గా.. తానే అంటూ మంచు మ‌నోజ్ ఓపెన్ అయ్యాడు.

`నువ్వంటే ఇష్టం.. ప్రాణం. మళ్ళీ సంతోషం.. ఆశ.. జీవితంలో వెలుగు వస్తోందంటే అది నీ వల్లే. నాకు హ్యాపీగా జీవించాల‌ని ఉంది.. నలుగురితో సంతోషంగా ఉండాలని ఉంది. నువ్వు ఒప్పుకుంటే నిన్ను, బాబుని నా జీవితంలోకి ఆహ్వానిస్తా` అని ప్రపోజ్ చేశాడ‌ట మ‌నోజ్‌. అందుకు మౌనిక.. `స‌రిగ్గానే ఆలోచించి చెప్పావా.. ఈ సొసైటీ గురించి ఆలోచించావా.. ఇంట్లో ఒప్పుకుంటారా..` అని అడిగింద‌ట‌. ఫైన‌ల్ గా మ‌నోజ్ ల‌వ్ ను ఒప్పుకుంది. అయినా అంత ల‌వ్లీగా ప్ర‌పోజ్ చేస్తే ఎవ‌రూ ఒప్పుకోరు చెప్పండి. పైగా బాబు బాధ్య‌త త‌న‌ది అని మ‌నోజ్ మౌనిక‌కు గ‌ట్టి భ‌రోసా ఇచ్చాడు. ఈ విష‌యంలో నిజంగా మ‌నోజ్ గ్రేట్ అని చెప్పాలి. అయితే ప్రేమ‌లో ప‌డ‌టానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌క‌పోయినా.. పెళ్లి చేసుకునేందుకు చాలా క‌ష్టాలు పడ్డ‌మ‌ని ఈ నూత‌న దంప‌తులు చెబుతున్నారు.