సజ్జలతోనే వైసీపీకి చిక్కులు..రెబల్స్ టార్గెట్!

వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ఆనం రామ్ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకొచ్చారు..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఇద్దరితో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి.వైసీపీ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో  ఆ నలుగురు మరింత రిలాక్స్ అయ్యారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే మంచిందని ఫీల్ అవుతున్నారు.

అదే సమయంలో చంద్రబాబు ఒక్కో ఎమ్మెల్యేకు 15-20 కోట్ల వరకు ఆఫర్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇక ఈ అంశంపై రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు సజ్జల టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. అసలు ప్రతి అంశంలోనూ సజ్జల బయటకొచ్చి మీడియాతో మాట్లాడటం, పార్టీ పరంగా అయినా, ప్రభుత్వ పరంగా అయినా ఆయనే అన్నీ చెబుతున్నారు. దీంతో సజ్జల ఎవరు తమని సస్పెండ్ చేయడానికి అని నలుగురు ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. విలేఖరిగా పనిచేసే సజ్జల..వేల కోట్లు ఎలా సంపాదించారని ఆనం విరుచుకుపడ్డారు.

అటు సజ్జల వల్ల తనకు ప్రాణహాని ఉందని, అందుకే ఏపీకి రావడం లేదని శ్రీదేవి అంటున్నారు. సజ్జల ఒక పనికిమాలిన సలహాదారుడు అని కోటంరెడ్డి ఫైర్ అవుతున్నారు. సజ్జల వల్లే వైసీపీ నాశనం అవుతుందని అంటున్నారు. ఇలా రెబల్ ఎమ్మెల్యేలు జగన్ పై పెద్దగా విమర్శలు చేయడం లేదు గాని..సజ్జల టార్గెట్ గానే విరుచుకుపడుతున్నారు.

దీని బట్టి చూస్తే వైసీపీపై మొత్తం పెత్తనం సజ్జలదే అన్నట్లు కనిపిస్తుంది. ఇక ఆయన వల్లే పార్టీ మునిగేలా ఉందనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి సజ్జలతోనే తలనొప్పి అని తెలుస్తోంది.