మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న తాజా అప్డేట్ రానే వచ్చింది.RC -15 సినిమా అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా టైటిల్ ని రిలీజ్ చేస్తూ తాజాగా మేకర్స్ ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC -15 టైటిల్ లోగో వీడియోని కాసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. దీంతో రాంచరణ్ బర్తడే విషెస్ తెలుపుతూ చిత్రబృందం భారీ అంచనాల మధ్య ఈ చిత్ర టైటిల్ని గేమ్ చేంజర్ ( GAME CHANGER) గా ఫిక్స్ చేయడం జరిగింది.
ఈ సినిమా పూర్తిగా పొలిటికల్ నేపథ్యంలో తేరకెక్కించబోతున్నట్లుగా ఈ టైటిల్ లోగో వీడియోని చూస్తే అర్థమవుతోంది .ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తూ ఉన్నది. అలాగే హీరోయిన్ అంజలి కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ ఉన్నారు. సంగీతాన్ని థమన్ అందిస్తూ ఉన్నారు
.
ఈ చిత్రం నుంచి లీకైన పోస్టర్స్ ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేలా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్వీపాత్రాభినయంలో నటిస్తున్నట్లుగా లీకైన ఫోటోలను చూస్తే మనకు అర్థమవుతోంది. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు అభిమానులు. తమ అభిమాన హీరోకు వినూత్నంగా బర్తడే విషెస్ తెలుపుతున్నారు చరణ్ అభిమానులు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా క్రేజీ సంపాదించుకున్న రాంచరణ్ ఈ చిత్రంతో ప్రపంచంలో ఎంతోమంది అభిమానులను. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది.