కడపలో సీన్ రివర్స్..స్వీప్ లేనట్లే!

కడప అంటే వైసీపీ..వైసీపీ అంటే కడప..అందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే కడపలో వైసీపీదే హవా.. వైఎస్సార్ ఉన్నంత కాలం ఇక్కడ కాంగ్రెస్ హవా నడవగా, ఆ తర్వాత వైసీపీ ఆధిక్యం కొనసాగుతుంది. గత రెండు ఎన్నికల్లో కడపలో వైసీపీదే ఆధిపత్యం..2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు ఉంటే వైసీపీ 9 సీట్లు గెలుచుకుంది.

ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది…10కి  10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. దీంతో అక్కడ వైసీపీ ఆధిక్యం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా స్వీప్ చేయడం సులువేనా అంటే చెప్పలేని పరిస్తితి..ఇప్పుడు పరిస్తితులు మారుతున్నాయి. వైసీపీ బలం కొన్ని స్థానాల్లో తగ్గుతుంది. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..దీంతో మార్పు వస్తుంది. కాకపోతే రెడ్డి వర్గం హవా ఉండటం వల్ల జిల్లాపై వైసీపీ పట్టు తగ్గడం లేదు.

కానీ కొన్ని స్థానాల్లో నేతల తప్పులు వైసీపీని దెబ్బకొట్టేలా ఉన్నాయి. దీంతో టి‌డి‌పి బలం పెరుగుతూ వస్తుంది. ఇటీవల సర్వేల్లో కూడా అదే తేలింది. ఇప్పుడు ఉన్న పరిస్తితుల్లో వైసీపీ 6 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని తేలింది. పులివెందుల, బద్వేలు, కడప, జమ్మలమడుగు, రాయచోటి, రైల్వే కోడూరు స్థానాల్లో వైసీపీకి గెలుపు అవకాశం ఉంది. ఇక మైదుకూరు, ప్రొద్దుటూరు స్థానాల్లో టి‌డి‌పి గెలుపుకు ఛాన్స్ ఉంది.

రాజంపేట, కమలాపురం స్థానాల్లో పోటాపోటి ఉంది. ఇందులో రాజంపేటలో కూడా టి‌డి‌పికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అంటే కడపలో వైసీపీ స్వీప్ చేయడం కష్టమని తేలిపోయింది. టి‌డి‌పి మూడు, నాలుగు సీట్లు గెలుచుకుంటే వైసీపీకి డేంజరే.