విశాఖ రాజధాని..జగన్‌కు ఉత్తరాంధ్ర షాక్..అసెంబ్లీలో రిపీట్!

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉన్న రాజధాని అమరావతిని కాదని..మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమరావతిని కేవలం శాసన రాజధానిగా ఉంచి..అసలైన రాజధానిగా విశాఖని పరిపాలన రాజధానిగా చేస్తామని జగన్ చెప్పారు. ఇటు కర్నూలుని న్యాయ రాజధాని అన్నారు. అయితే ఇందులో మెయిన్ విశాఖనే. ఈ రాజధాని వెనుక రాజకీయ కోణం చాలా ఉంది. అది జనాలకు బాగా తెలుసు. అంతే తప్ప ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయాలని అనుకుంటే ఎలాగైనా చేయవచ్చు.

కానీ రాజధాని పేరుతో వైసీపీ చేస్తున్న రాజకీయం వేరు..ఆ విషయం అక్కడి ప్రజలకు అర్ధమైంది. అయితే ఉన్నపళంగా వైసీపీని వ్యతిరేకించే పరిస్తితి లేదు. సమయం కోసం చూశారు..ఇదే క్రమంలో పట్టభద్రులు తమ సత్తా ఏంటో చూపించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. విశాఖ రాజధాని అనే కాన్సెప్ట్ అసలు అక్కడి పట్టభద్రులు పట్టించుకోలేదు. రాజధాని పేరుతో వైసీపీ చేస్తున్న అక్రమాలని తిప్పికొడుతూ టి‌డి‌పిని గెలిపించారని విశ్లేషణలు వస్తున్నాయి.

అసలు పట్టభద్రుల స్థానంలో టి‌డి‌పి అభ్యర్ధి వేపాడ చిరంజీవి రావుకు..వైసీపీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారంటే..అక్కడ పట్టభద్రులు వన్ సైడ్ గా ఎలాంటి తీర్పు ఇచ్చారో అర్ధం చేసుకోవచ్చు. ఏ మాత్రం వైసీపీకి ఛాన్స్ ఇవ్వలేదు. అసలు టీడీపీకి 45 శాతం వరకు ఓట్లు రావడం..వైసీపీకి 27 శాతం వరకు ఓట్లు పడ్డాయంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ప్రజలు వైసీపీని వ్యతిరేకిస్తున్నారని అర్ధమవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజలు వైసీపీని తిరస్కరిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

Share post:

Latest