ఆ రెండు సర్వేల్లో వైసీపీ గ్రాఫ్ డౌన్..టీడీపీకే ఆధిక్యం.!

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుంది. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతుంది. ప్రధానంగా వైసీపీ-టి‌డి‌పి-జనసేనలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయం నడిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రధాన పోటీ వైసీపీ-టి‌డి‌పిల మధ్యే ఉన్న విషయం తెలిసిందే. నెక్స్ట్ మళ్ళీ అధికారం దక్కించుకోవాలని వైసీపీ..ఈ సారి ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టి అధికారంలోకి రావాలని టి‌డి‌పి చూస్తుంది. ఇక ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

ఇదే క్రమంలో రాష్ట్రంలో పార్టీల బలాబలాలపై సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా శ్రీ ఆత్మసాక్షి సంస్థ సంచలన సర్వే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వే ప్రకారం…టి‌డి‌పి 78 స్థానాల్లో, వైసీపీ 63, జనసేన 7 స్థానాల్లో గెలుస్తుందని, 27 స్థానాల్లో వైసీపీ-టి‌డి‌పిల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేసింది. ఇక టి‌డి‌పికి దాదాపు 42.5 శాతం ఓట్లు, వైసీపీకి 41.5 శాతం ఓట్లు, జనసేనకు 11 శాతం ఓట్లు వస్తాయని తేల్చి చెప్పింది.

అయితే ఈ సర్వే కాకుండా ఓ వైసీపీ ఎంపీ అంతర్గతంగా చేయించిన సర్వే కూడా తెలిసింది. ఇది బయటకు విడుదల చేయలేదు గాని..అంతర్గతంగా వచ్చిన ఈ సర్వేలో వైసీపీకి 42 శాతం పైనే..టి‌డి‌పికి 41 శాతం పైనే..జనసేన 12 శాతం పైనే ఓట్లు వచ్చాయి అంటా. అంటే గత ఎన్నికల్లో వైసీపీకి 49.5 శాతం, టి‌డి‌పికి 39.5 శాతం, జనసేనకు 6 శాతం వరకు ఓట్లు వచ్చాయి.

కానీ ఇప్పుడు వైసీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోతూ..టి‌డి‌పి-జనసేన గ్రాఫ్ పెరుగుతుందనే చెప్పాలి. అయిట్ కృష్ణా-గుంటూరు జిల్లాల్లో వైసీపీ ఓట్లు 10 శాతం వరకు, ఉభయ గోదావరి జీలల్లో 7 శాతం, ఉత్తరాంధ్రలో 5 శాతం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో 4 శాతం ఓట్లు వరకు వైసీపీ కోల్పోతుందని తెలిసింది. అంటే వైసీపీ గ్రాఫ్ పడిపోతుంటే..టి‌డి‌పి లీడ్ పెరుగుతుంది.