OTT లపై… సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి..!!

ఇటీవలే ఇద్దరూ తెలుగు హీరోలు నటించిన ఓటిటి కంటెంట్ పై ఘాటుగా వాక్యాలు వినిపిస్తున్నాయి. అందులో అడల్ట్ సన్నివేశాలతో టాలీవుడ్లో సీన్ ఒక్కసారిగా వేడెక్కింది. అందుకనే తెలుగు ఓటీటి కంటెంట్ పై వ్యతిరేకత పెరుగుతోందా? ఓటిటి కంటెంట్ కి సెన్సార్ తప్పని సరి చేయాలని ఒత్తిడి మొదలయ్యిందా అంటే.. ఈ మాటలకు అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు లేని టాలీవుడ్ లో కొత్త సాంస్కృతి ఆ ఒక్క సిరీస్ తీసుకొచ్చింది. దీంతో నటులే దిగొచ్చి కుటుంబంతో తమ సిరీస్ చూడొద్దని ప్రకటించారు.

అంతేకాకుండా మాజీ సెన్సార్ బోర్డు చైర్మన్.. నటుడు శివకృష్ణ ఓటిటి కంటెంట్ కి కూడా సెన్సార్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా బిజెపి నేత విజయ్ శాంతి తనదైన శైలిలో స్పందించారు. ఆమె కూడా ఇలాగే వెబ్ సిరీస్ లకు సెన్సార్ తప్పనిసరి అంటూ తెలుపుతోంది. ఇలా ఈ అంశాన్ని చాలామంది ప్రేక్షకులు మహిళలు బోర్డు ముందుకు తీసుకొచ్చారన్నారు. ఈ మధ్యలో విడుదలైన ఓ తెలుగు ఓటీటి సిరీస్ పై అటు సోషల్ మీడియా ఇటు విజయశాంతి ఓ పోస్ట్ పెట్టారు. ఇలాంటి అసభ్యకర వెబ్ సిరీస్ ని తొలగించి ప్రజా వ్యతిరేకతకు గురికాకుండా ఉండాలని హెచ్చరించారు. నటులకు నిర్మాతలకు తనదైన శైలిలో సూచనలు ఇచ్చారు. ఇలాగే ఉంటే మహిళా వ్యతిరేకత ఉద్యమాల వరకు వెళ్తాయంటూ హెచ్చరించారు.

ఇలా విజయ్ శాంతి వ్యాఖ్యలకు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. అసభ్యకర సన్నివేశాలకు మొదటిలోనే చెక్ పెట్టకపోతే సమాజం మరింత చెడిపోతుందని… విజయ్ శాంతి నూటికి నూరుశాతం నిజం చెప్పారన్నారు. ఇలాంటి సిరీస్ లను ఎవరు ప్రోత్సహించవద్దని విజయ్ శాంతి ఆమె మాటల్లో తెలిపారు. మొత్తానికి ఒక్క వెబ్ సిరీస్ తో టాలీవుడ్ లో పెద్ద భూకంపం వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ విషయంపై వైరల్ గా మారుతోంది విజయ్ శాంతి.