చరణ్‌ని పనివాడిని చేసిన ఉపాసన.. అంతేగా, అంతేగా అంటున్న ఫ్యాన్స్!!

ఎంతటి గొప్పవాడైనా పెళ్ళాం దగ్గరకి వచ్చేసరికి ఆమె సేవకుడిగా మారాల్సిందే. అది పేదవారి నుంచి సెలబ్రిటిల వరకూ అందరికీ వర్తిస్తుంది. అయితే ప్రముఖ నటుడు, పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ విషయంలోనూ ఇదే జరిగింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన విషయం అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్ బరిలోకి దిగింది.

ఇక ఈ ఆస్కార్ అవార్డు ఫంక్షన్ కోసం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు సినిమాకి సంబంధించిన ఇంకొంతమంది అమెరికాకి వెళ్లారు. ఈ నెల 12న జరుగుతున్న ఈ వేడుకకు అంతా సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ అవార్డ్స్ ఫంక్షన్ కోసం రామ్ చరణ్ తో పాటు అతని భార్య ఉపాసన కూడా యూఎస్ వెళ్ళింది.

ఈవెంట్ కంటే ముందుగానే వారు అమెరికాకి వెళ్లడంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే ఆ ఫోటోలన్నిటిలో ఒక ఫొటో మాత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ పిక్ లో ఉపాసన ముందు నడుస్తుంటే, ఆమె షాపింగ్ చేసిన బ్యాగ్ ని వెనుక పట్టుకొని నడుస్తు వస్తున్నాడు చరణ్. ఈ ఫోటో చూసిన చాలా మంది పెళ్లి అయిన ప్రతి మగాడికి ఇలాంటి బాధలు తప్పవు, ఎలాంటి మగవాడైన పెళ్ళాం కొంగుపట్టుకొని తిరగాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest