ప్రియాంక చోప్రా ఇంద్రభవనాన్ని చూసి ఫిదా అయిన ఉపాసన.. పిక్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన లాస్ ఏంజెల్స్‌లో చాలా సరదాగా గడుపుతున్నారు షాపింగ్, బోట్ రైడ్స్‌ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరు ఆస్కార్స్ సీజన్‌ను ఎంజాయ్ చేస్తూ హాలీవుడ్‌లో తమ స్నేహితులతో గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆస్కార్ 2023 కోసం లాస్ ఏంజిల్స్‌లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కొణిదెల శనివారం ప్రియాంక చోప్రా ఇంద్రభవనానికి వెళ్లారు. ఈ జంట ప్రియాంక, ఆమె తల్లి మధు చోప్రా, నిక్ జోనాస్ తల్లిదండ్రులు డెనిస్, పాల్ కెవిన్ జోనాస్‌లతో కొన్ని లవ్లీ ఫొటోలు తీసుకున్నారు.

ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోలను షేర్ చేశారు. “LA కుటుంబం. హాలీవుడ్ ప్రియాంకచోప్రా ఎల్లప్పుడూ మా కోసం సహాయం చేసేందుకు ముందుంటుంది. ధన్యవాదాలు.” అని ఒక క్యాప్షన్ జోడించింది. రామ్ చరణ్, ప్రియాంక 2013lలో జంజీర్‌లో కలిసి పనిచేశారు. అలా వీరి మధ్య ఫ్రెండ్‌షిప్ కుదిరింది. ఫోటోలలో ప్రియాంక చోప్రా ఇంద్రభవనాన్ని మీరు గమనించవచ్చు. అక్కడ ఉపాసన చాలా సంతోషంగా గడుపుతూ ఉండటం కూడా గమనించవచ్చు.

ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో యూఎస్ నుంచి మరో ఫోటోను కూడా షేర్ చేసింది. ఇందులో రాజమౌళి, రామ్ చరణ్ ఇంకా తదితరులు ఒక హోటల్‌లో ఫుడ్ తింటున్నట్లు కనిపించింది.

శుక్రవారం ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోని పారామౌంట్ పిక్చర్స్ స్టూడియోలో సౌత్ ఏషియన్ ఎక్సలెన్స్ ప్రీ-ఆస్కార్ బాష్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, ఉపాసన, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఎన్టీఆర్ జూనియర్, గునీత్ మోంగా, షౌనక్ సేన్, మిండీ కాలింగ్, మలాలా యూసఫ్‌జాయ్ సహా పలువురు హాజరయ్యారు.

ఇకపోతే RRR సినిమాలోని నాటు నాటు పాట ఈ సీజన్‌లో అవార్డుల వేడుకల్లో అగ్రగామిగా నిలిచింది. ఈ పాట గోల్డెన్ గ్లోబ్స్‌లో ఒక అవార్డును గెలుపొందింది. ఉత్తమ పాటల విభాగంలో ఆస్కార్స్ 2023లో కూడా నామినేట్ అయింది.

Share post:

Latest