ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ హీరో తండ్రి మృతి..!!

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కు తమిళంలో ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు అజిత్. ఈ ఏడాది తునీవు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో అజిత్ బిజీగా ఉండగా అజిత్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అజిత్ తండ్రి సుబ్రమణియన్ మరణ వార్త విని అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.

ఇక అజిత్ తండ్రి మరణించారనే వార్త తెలియడంతో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సుబ్రమణియన్ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా పలు రకాలుగా పోస్టులను తెలియజేస్తున్నారు. అజిత్ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కావడంలేదు ..గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో అజిత్ తండ్రి బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు ఉదయం ఈయన చెన్నైలో తుది శ్వాస విడిచినట్లు సమాచారం. అజిత్ తండ్రి మరణ వార్త కోలీవుడ్ నే తీర దిగ్బ్రాంతికి గురిచేస్తుంది.

ఇక బాధను తట్టుకునే ధైర్యాన్ని అజిత్ కుటుంబానికి ఆ దేవుడే ఇవ్వాలంటూ అభిమానులు సైతం కోరుకుంటున్నారు. అజిత్ కెరియర్ పరంగా బాగానే సక్సెస్ సాధించడం వెనుక తన తండ్రి పాత్ర కూడా ఉన్నది చెన్నైలో బీసెంట్ నగర్ లో ఉన్న స్మశానవాటికలో ఈరోజు సుబ్రమణియన్ అంత్యక్రియలు జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అజయ్ దుబాయ్ లో ఉండగా తన తండ్రి వార్త తెలియగానే వెంటనే చెన్నైకు బయలుదేరారు ప్రస్తుతం సుబ్రమణియన్ వయసు 84 సంవత్సరాలు. అజిత్ 62వ మూవీ తెరకెక్కిస్తూ ఉన్నారు.

Share post:

Latest