బాల‌య్య – శ్రీదేవి కాంబినేష‌న్లో మిస్ అయిన రెండు సినిమాలు ఇవే..!

నందమూరి బాలకృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్‌లో సినిమా ఎందుకు రాలేదు? అనే సందేహం అప్పటి వారికే కాదు.. ఈ తరం ప్రేక్షకాభిమానులకు కూడా వస్తుంది.. ఎందుకంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత చిరంజీవి.. నాగేశ్వర రావు కొడుకు నాగార్జునతో పాటు వెంకటేష్‌తోనూ ఆమె నటించింది. కానీ ఒక్క బాలయ్య బాబుతో మాత్రమే జత కట్టలేదు.. పైగా ఎన్టీఆర్ ‘బడిపంతులు’ చిత్రంతో బాలనటిగా పరిచయం అయిన శ్రీదేవి.. 1970 కాలంలో.. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చి ఆయనతో కథానాయికగా సూపర్ డూపర్ ఫిలింస్ చేసి.. బంపర్ జోడీ అనిపించుకుంది.

అటువంటి శ్రీదేవితో బాలయ్య నటించకపోవడానికిగల ఆసక్తికరమైన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఎన్టీఆర్‌తో చేసిన శ్రీదేవికి ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ ప‌క్క‌న కూడా న‌టించే ఛాన్స్ వ‌చ్చింది. అయితే రెండుసార్లూ కూడా ఎన్టీఆర్ ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతోనే ఈ అరుదైన కాంబినేష‌న్ మిస్ అయ్యింది. బాల‌య్య స‌మ‌కాలీన హీరోలు చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్ ముగ్గురు ప‌క్క‌న శ్రీదేవి జోడీ క‌ట్టింది. అయితే బాల‌య్య‌తో మాత్రం ఆమె న‌టించ‌లేదు. అయితే రెండుసార్లు ఈ కాంబినేష‌న్ సెట్ అయ్యి.. క్యాన్సిల్ అయ్యింది.

samma - Telugu Lives - Telugu Latest News

1987లో రాఘ‌వేంద్ర‌రావు బాల‌య్య – శ్రీదేవి కాంబోలో సామ్రాట్ సినిమా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్‌కే ఈ కాంబినేష‌న్ న‌చ్చ‌లేదు. అలా ఫ‌స్ట్ టైం వీరిద్ద‌రు జంట‌గా రావాల్సిన సినిమా మిస్ అయ్యింది. ఆ త‌ర్వాత 1989లో మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ కోదండ రామిరెడ్డి భ‌లేదొంగ సినిమాలో బాల‌య్య ప‌క్క‌న శ్రీదేవిని న‌టింప‌జేయాల‌ని.. వీరిద్ద‌రి కాంబినేష‌న్ సెట్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కోదండ‌రామి రెడ్డి అంటే శ్రీదేవికి కూడా గౌరవమే. అడిగితే ఆయన మాట కాదనదు.. అలానే బాల‌య్య బాబు ప‌క్క‌న న‌టించ‌డానికి కూడా అంగీకరించే సమయంలో.. కొంతమంది నంద‌మూరి అభిమానులు ఈ ప్ర‌య‌త్నానికి అడ్డు తగిలారు.

అందరి హీరోయిన్స్ కి కలిసి నటించిన బాలయ్య ఎందుకు శ్రీదేవి తో నటించలేదు ?  దాని వెనుకున్న కారణం అదేనా ?

శ్రీదేవి, తండ్రి ఎన్టీఆర్‌తో పాటు కొడుకు బాలయ్య ప‌క్క‌న కూడా న‌టిస్తే బాగోద‌ని ఏకంగా ఎన్టీఆర్‌కే వెళ్లి చెప్ప‌డంతో.. ఆయన మళ్లీ ఈ కాంబోకి నో అన్నారు. ఆ విధంగా ‘భ‌లేదొంగ‌’ లో శ్రీదేవి స్థానంలో విజ‌య‌ శాంతిని తీసుకున్నారు.శ్రీదేవి తండ్రితో పాటు కొడుకు ప‌క్క‌న న‌టిస్తే బాగోద‌ని ఎన్టీఆర్‌కే చెప్ప‌డంతో మ‌ళ్లీ ఎన్టీఆర్ ఈ కాంబినేష‌న్‌కు అడ్డుప‌డ్డారు. అలా భ‌లేదొంగ‌లో శ్రీదేవి ప్లేసులో విజ‌య‌శాంతిని తీసుకున్నారు. ఆ త‌ర్వాత ఎప్పుడూ బాల‌య్య – శ్రీదేవి కాంబినేష‌న్ సెట్ చేసేందుకు ఎవ్వ‌రూ ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు.