బాలయ్య – విజయశాంతి మధ్య గ్యాప్‌కు కారణం అదే… అయినా బాల‌య్య అంటే ఇష్ట‌మే…!

తెలుగుతెరపై ఎన్నో హిట్ సినిమాలు చేసి మంచి జంటగా పేరు పొందిన హీరో హీరోయిన్లు చాలామందే ఉంటారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ విజయశాంతి కూడా ఒకరు. 1980 సంవత్సరంలో దాదాపుగా వీరిద్దరి కాంబినేషన్ లోనే 17 సినిమాలకు పైగా నటించారు. దాంతో పాటు సినీ నిర్మాతలకు లాభాల పంట కూడా పండించారు.

బాలకృష్ణ కు ఆ ముగ్గురు హీరోయిన్స్..అభిమానులు కోరుకునే కాంబో | Balakrishna  Crazy Combinations Vijayashanthi Roja Simran Details, Balakrishna,  Balakrishna Heroines, Nandamuri Balakrishna, Vijaya Shanthi ...

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిట్టచివరి సినిమా నిప్పురవ్వ. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం మానేశారు. అయితే వీరిద్దరూ కలసి నటించడం మానేసిన తర్వాత అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకులలో రకరకాలుగా వార్తలు వినిపించాయి. నిప్పురవ్వ సినిమా సమయంలో బాలకృష్ణ విజయశాంతి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయని అందుకే వీరిద్దరూ కలిసి నటించడం లేదని వార్తలు బాగా పుకార్లు లేపాయి.

వెండితెరపై బాలకృష్ణ, విజయశాంతిది తిరుగులేని జోడి.. సాక్ష్యం ఇదిగో.. |  balakrishna vijayashanti combination was huge craze in tollywood silver  screeen– News18 Telugu

ఇక వీరిద్దరి కాంబినేషన్లో నిప్పురవ్వ చివరి సినిమాగా నిలిచిపోయింది. అయితే బాలయ్య అంటే విజయశాంతికి ఇప్పటికీ వల్లమాలిన అభిమానం ఉందని ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. విజయశాంతి భర్త కూడా శ్రీనివాస ప్ర‌సాద్ కూడా బాలయ్యకు సన్నిహితుడు… సమీప బంధువు అని అంటారు.

విజయశాంతి ఇప్పుడైనా బాలయ్యకు జోడిగా నటిస్తే ఖచ్చితంగా అది సెన్సేషనల్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా చూస్తామా లేదా అన్న ప్రశ్నకు కాల‌మే సమాధానం చెప్పాలి.

Share post:

Latest