సమంతతోనే ఆ సాహసం చేపిస్తున్న బ్యూటీ ప్రొడక్ట్స్‌ కంపెనీ.. ఎందుకంత పిచ్చి..?

ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సమంత రూత్ ప్రభు. తన నటనతో, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్ వెబ్‌సిరీస్‌లో నటిస్తూ అక్కడ కూడా తన సత్తా చాటుకుంటుంది. ఒకవైపు సినిమాలతో ఇంకోవైపు వెబ్ సిరీస్‌లతో బాగా డబ్బు సంపాదిస్తున్న సమంత ఇప్పుడు కొన్ని బ్యూటీ ప్రొడక్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ మరింతగా సంపాదిస్తుంది.

అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పిక్‌కి దాదాపు రూ.20 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక ఇప్పుడు టాప్ బ్యూటీ ప్రొడక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టింది. ప్రముఖ బ్యూటీ ప్రొడక్ట్స్ సంస్థ మామ ఎర్త్ బ్యూటీ ప్రొడక్ట్స్ వారు ఎటువంటి రసాయనాలు లేకుండా కేవలం ప్రకృతి పదార్దాలను మాత్రమే వాడి బ్యూటీ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంటారు. జంతువులకు హాని కలిగించకుండా కేవలం మొక్కల నుండి వచ్చే రసాయనాలను వాడడం అనేది వీరి ముఖ్య ఉదేశ్యం. అందుకే వారి కంపెనీ వెబ్సైట్లో ఏదైనా ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసినప్పుడు ఏ మొక్క నుండి అప్రొడక్ట్ తయారు చేశారో లింక్ ని షేర్ చేస్తుంటారు.

అంతేకాకుండా మనం మామ వెబ్‌సైట్‌లో ఏదైనా ప్రోడక్ట్ కొంటే వారు ఒక మొక్కని నాటుతున్నారు. అలా చెయ్యడం వాళ్ళ 2025 నాటికి దాదాపు 10 లక్షల మొక్కలను నటి ప్రకృతిని కాపాడతారు. ఇలాంటి మంచి ఉద్దేశంతో మొదలైన మామ ఎర్త్ బ్రాండ్‌కి సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం చాలా విశేషం. ఈ సందర్బంగా సామ్ అభిమానులతో మాట్లాడుతూ “ఈ సంస్థలో జాయిన్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను అభిమానించే వారికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో నేను మామ ఎర్త్ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాను. నాలానే మామ ఎర్త్ వారు కూడా మిమల్ని వారి ప్రొడక్ట్స్‌తో సంతోషపరుస్తారని ఆశిస్తున్నాను. ” అంటూ తెలిపింది. కాగా ఒక డిసీజ్‌తో బాధపడుతున్న సమంతతో బ్యూటీ ప్రొడక్ట్స్‌ కంపెనీ ఇలాంటిది చేయడం ఆశ్చర్యంగా ఉందని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Share post:

Latest