ఏంటీ.. ఆస్కార్ కోసం రాజమౌళి చేసిన ఖర్చు తో అన్ని సినిమాలు తియ్యొచ్చా?

ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` చిత్రం ఆస్కార్ రేసులో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో.. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళితో సహా చిత్ర టీం అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నారు. వ‌రుస ఇంట‌ర్వ్యూల‌తో అమెరికన్ మీడియాతో ఇంట్రాక్ట్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్‌ గురించి హాలీవుడ్ ప్రముఖులు మాట్లాడుకునేలా చేశారు.

ఇప్పటివరకు అనేక ప్ర‌తిష్టాత్మ‌క అవార్డ్స్ అందుకున్న `ఆర్ఆర్ఆర్‌`.. ఆస్కార్ ను కూడా సొంతం చేసుకుంటుంద‌ని ఇండియ‌న్ సినీ ప్రియులు న‌మ్మ‌కంగా ఉన్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ `ఆర్ఆర్ఆర్‌` మూవీపై చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్‌గా ర‌వీంద్ర భార‌తిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ పాల్గొన్నారు.

సినిమా మేకింగ్ అనే ఎలా మారింద‌నే ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఆయ‌న మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. `ఆర్ఆర్ఆర్‌` మూవీ కి ఆస్కార్ అవార్డు రప్పించుకోవడం కోసం, రాజ‌మౌళి రూ. 80 కోట్ల రూపాయిలను ఖర్చు చేసింది. ఆ 80 కోట్ల రూపాయలతో ప‌ది చిన్న సినిమాలు తీసేయొచ్చు` అంటూ వ్యాగ్యంగా మాట్లాడారు. ఈయ‌న వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఎంత గొప్ప చిత్రం అయినప్పటికీ ఆస్కార్ జ్యూరీ సభ్యుల దృష్టిలో పడాలంటే ప్రచారం చేయాలి. ఈ నేప‌థ్యంలోనే ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్‌ టీమ్ అంత మొత్తం ఖర్చు పెట్ట‌డంలో త‌ప్పులేద‌ని చాలా మంది అంటున్నారు.