చిరంజీవికి బిగ్ షాక్ ఇచ్చిన త‌మ‌న్నా.. మిల్కీ బ్యూటీ అంత ప‌ని చేసిందేంటి?

మెగా స్టార్ చిరంజీవికి మిల్కీ బ్యూటీ తమన్నా బిగ్ షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా `భోళా శంక‌ర్‌` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా నటిస్తోంది. త‌మిళ‌ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది.

హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి తమన్నా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా పాత్ర కంటే కీర్తి సురేష్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే తాజాగా స్క్రిప్ట్ లో మరికొన్ని మార్పులు చేశారట. ఈ క్రమంలోనే తమన్నాకు చెప్ప‌కుండా ఆమె పాత్ర‌కు సంబంధించి కొన్ని సీన్స్ ను తొలగించారట.

దాంతో సినిమాలో తమన్నా పాత్రకు ప్రాధాన్యతే కాదు ర‌న్ టైం కూడా బాగా తగ్గిపోయిందట. ఈ నేపథ్యంలోనే తమన్నా అసహనంతో ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ ప్రచారం జరుగుతోంది. ప్ర‌స్తుతం మేకర్స్ మరో హీరోయిన్ ను తీసుకునే పనిలో పడ్డట్టు టాక్ న‌డుస్తోంది. మరి నిజంగానే తమన్నా ఈ మూవీ నుంచి తప్పకుండా లేదా అన్న‌ది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest