అదే నిజమైతే శ్రీలీల ఛాప్టర్ క్లోజ్.. తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే . కన్నడ బ్యూటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి సందడ్ అనే సినిమాతో మంచి నటిగా పేరు సంపాదించుకుంది . అంతేకాదు ఆ తర్వాత రిలీజ్ అయిన ధమాకా సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయినా శ్రీ లీల .. ప్రెసెంట్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది .నందమూరి బాలయ్య దగ్గర నుంచి టాలీవుడ్ బడాస్టార్ హీరోల అందరి సినిమాల్లోనూ భాగమైంది.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కబోయే బాలయ్య సినిమాలో కూతురుగా కనిపించబోతున్న శ్రీ లీల .. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఏకంగా రెండు సినిమాల్లో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ గా టాపిక్ ట్రెండ్ అవుతుంది . అయితే ఇప్పటివరకు తన రెమ్యూనరేషన్ ని రెండు కోట్లు మూడు కోట్లుగా ఫిక్స్ చేసుకున్న శ్రీ లీల.. పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రం ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేస్తుందట .

దీంతో ఒక్కసారి మండిపడుతున్నారట మేకర్స్. ఒకే ఒక హిట్ పడేసరికి ఇంత హెడ్ వెయిటా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. అంతేకాదు ఈ రేంజ్ లోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి శ్రీలీలను తప్పించడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది . మరో పర్ఫెక్ట్ హీరోయిన్ దొరికితే ఖచ్చితంగా శ్రీలీలను ఈ సినిమా నుంచి తప్పించేస్తారు మేకర్స్ అంటున్నారు సినీ విశ్లేషకులు . అంతేకాదు ఈ విధంగా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతే శ్రీలీలతో సినిమాలు చేయాలంటే మేకర్స్ భయపడతారని .. తద్వారా ఆమెకు అవకాశాలు తగ్గుతాయని.. ఇక శ్రీలీల అప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టుకొవాల్సిందే అంటున్నారు జనాలు. చూద్దాం మరి శ్రీ లీల రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?

 

Share post:

Latest