“మా బెడ్ రూమ్ లోకి రండి”.. స్టార్ హీరో పిచ్చి పనికి ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రిటీస్ ప్రైవసి కి కరువైంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఎలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయో మనందరికీ బాగా తెలిసిందే. స్టార్ సెలబ్రెటీస్ ఎక్కడికి వెళ్లినా సరే పరుగు పరుగున వెనకల కెమెరామెన్లు వెళ్తూ ..వాళ్ళ ప్రైవసీలను సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా విరాట్ కోహ్లీకి సంబంధించిన బెడ్ రూమ్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే .

ఆయన హోటల్ రూమ్ లో ఉన్న బెడ్ రూమ్ కి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు కొందరు ఆకతాయిలు. ఆ తర్వాత ఆలియా భట్ మేడ పై ఉన్న పర్సనల్ వీడియోని కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఆమెకు షాక్ ఇచ్చారు . ఈ క్రమంలోనే రీసెంట్ గా మరో స్టార్ సెలబ్రిటీ మీడియాపై ఫైర్ అయ్యారు . సెలబ్రిటీస్ కి ప్రైవసీ ఇవ్వరా అంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాలీవుడ్ స్టార్ కపుల్ గా పేరు సంపాదించుకున్న సైఫ్ అలీ ఖాన్ – కరీనాకపూర్ రీసెంట్గా ఓ మ్యారేజ్ కి అటెండ్ అయ్యారు . ఆ తర్వాత ఈవెంట్లో ఫోటోకి ఫోజులు ఇచ్చిన ఈ జంట.. ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా ఫోటోగ్రాఫర్లు ఫొటోస్ కోసం ఎగబడ్డారు . అంతేకాదు వాళ్ళ ఇంటి డోర్ వరకు వెళ్లిపోయి పిక్స్ ను క్లిక్ చేయడానికి ట్రై చేశారు . ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఫైర్ అయిపోయిన సైఫ్ అలీ ఖాన్ ..”రండి మా బెడ్ రూమ్ లోకి కూడా వచ్చి ఫొటోస్ తీసేయండి “అంటూ కోపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సైఫ్ అలా అరవడం ఫ్యాన్స్ కి నచ్చలేదు..అదే విషయాని కూల్ గా కూడా చెప్పచ్చు గా అంటూ ఫైర్ అవుతున్నారు..!!

 

 

Share post:

Latest