స‌గం త‌గ్గినా ప‌ట్టించుకోవ‌డం లేదు.. ర‌ష్మిక ప‌రిస్థితి దారుణం!

రష్మిక మందన్నా.‌. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న హీరోయిన్ల జాబితాలో రష్మిక ఒకటి. పుష్ప విడుదల తర్వాత ర‌ష్మికకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తక్కింది. దాంతో సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది.

రెమ్యున‌రేష‌న్ ను కూడా భారీగా పెంచేసి నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపించింది. అయితే అలాంటి తరుణంలోనే రష్మిక వరుస వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా కాంతార సినిమా విషయంలో సొంత గడ్డ అయిన కన్నడలో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది. కాంతార వివాదం దెబ్బ‌కు రష్మిక గ్రాఫ్ బాగా పడిపోయింది. దీనికి తోడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 4 కోట్లు రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తుండ‌టంతో.. ఆఫర్లు కూడా అంతంత మాత్రం గానే మారాయి.

ఈ ఏడాది వారసుడు సినిమాతో హిట్టు పడిన రష్మిక జాతకం మారలేదు. ప్రస్తుతం చేతిలో పుష్ప 2, యానిమల్ తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. దీంతో రష్మిక ఆఫర్ల కోసం తన రెమ్యున‌రేష‌న్‌ను సగానికి తగ్గించేసుకుంద‌ట‌. అయినా స‌రే ఫిల్మ్ మేక‌ర్స్ ర‌ష్మికను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఇలాగే మ‌రికొద్ది రోజులు సాగితే ఆమె ప‌రిస్థితి దారుణంగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

Share post:

Latest