సినిమాలకు బ్రేక్.. బిగ్ బాంబ్ పేల్చిన రామ్ చ‌ర‌ణ్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గ‌త ఏడాది కాలం నుంచి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఆస్కార్ బ‌రిలోనూ దూసుకెళ్తోంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో.. చిత్ర టీం అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ అక్కడ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ అమెరికన్ మీడియాతో బాగా ఇంట్రాక్ట్ అవుతున్నాడు. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్.. సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకున్నా అంటూ బిగ్ బాంబ్ పేల్చాడు. `ఆర్ఆర్ఆర్‌ సినిమాకు ముందు నేను కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇద్దామ‌నుకున్నా అనుకున్నాను. కాస్త గ్యాప్ తీసుకొని కొత్తగా ఏదైనా నేర్చుకొని మళ్ళీ మంచి కమ్ బ్యాక్ ఇవ్వాల‌ని అన్ని ప్లాన్స్ చేసుకున్నాను.

కానీ, స‌రిగ్గా అప్పుడే ఆర్ఆర్ఆర్ లో ఆఫ‌ర్ వ‌చ్చింది. ఇక రాజమౌళి కన్నా తను కొత్తగా ఏదైనా నేర్చుకునేది ఎక్కడా దొరకదు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నదేదో.. సినిమా చేస్తూ రాజమౌళి దగ్గర నేర్చుకోవచ్చు అని నాకు అనిపించింది. అందుకే ఆర్ఆర్ఆర్ కు ఓకే చెప్పా. ఇక ఈ సినిమా షూటింగ్ లో ఎంతో నేర్చుకున్నాను. రాజమౌళి కాలేజీలో నేను ఒక స్టూడెంట్ అయినందుకు సంతోషంగా ఉంది` అంటూ రామ్ చ‌ర‌ణ్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest