బ‌న్నీ మిస్ చేసుకున్న‌ రామ్ చ‌ర‌ణ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏంటో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇద్దరు మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలే. ప్రస్తుతం వీరిద్దరూ టాలీవుడ్ టాప్ హీరోల గానే కాదు పాన్ ఇండియా స్టార్స్ గా కూడా వెలుగొందుతున్నారు. అయితే రామ్ చరణ్ తో పోలిస్తే బన్నీనే వేగంగా సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ ఇప్పటివరకు చేసింది 14 సినిమాలు కాగా.. అందులో సగం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

ఇక రామ్ చరణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `నాయక్` ఒకటి. వి. వి. ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్లుగా న‌టించారు. 2013లో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ చరణ్ కాదట. నిజానికి ఈ సినిమా కథను బద్రీనాథ్ సినిమా షూటింగ్ సమయంలోనే వినాయక బన్నీకి వినిపించాడట.

 

బన్నీకి కథ నచ్చే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ బద్రీనాథ్ సినిమా ఫ్లాప్ అవడంతో.. నాయక్ ను అయినా పక్కన పెట్టేశాడట. ఆ తర్వాత రామ్ చరణ్ తో నాయక తీయగా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలా రామ్ చరణ్ హిట్ మూవీని బన్నీ చేతులారా మిస్ చేసుకున్నాడు.