ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది ఓ సంచలనం … గల్లీ బాయ్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఇది నిజంగా ప్రతి ఇండియన్ గర్వపడాల్సిన మూమెంట్ . గల్లీ బాయ్ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేదికపై పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ ఫ్యాన్స్ ఉబ్బితబిబ్బై పోతున్నారు. రాహుల్ సిప్లిగంజ్ పేరును ట్రెండ్ చేస్తున్నారు . మనకు తెలిసిందే.. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. రణం రౌద్రం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్గా హాలీవుడ్లో రిలీజ్ అయ్యి.. సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

ఎంతో మంది దర్శక దిగ్గజాలు రాజమౌళిని ప్రశంసిస్తున్నారు . ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయింది. ఖచ్చితంగా ఈ సినిమా ఆస్కార్ కొడుతుంది అని తెలుగు ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గల్లీ బాయ్ గా పేరు సంపాదించుకున్న ఒకప్పటి యూట్యూబర్ రాహుల్ సిప్లిగంజ్ అరుదైన గౌరవం అందుకున్నారు.

ఎవరు కలలో కూడా ఊహించని గౌరవం దక్కించుకున్నాడు . ఆస్కార్ వేదికపై రాహుల్ సిప్లగంజ్ నాటు నాటు పాటను పాడబోతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సినిమా వేడుకైన ఆస్కార్ కి ఆహ్వానం అందుకోవడమే గొప్ప గౌరవంగా భావిస్తాము.. అలాంటిది రాహుల్ సిప్లిగంజ్ అంత మంది స్టార్స్ మధ్యతన గానం వినిపించనున్నారు అని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. అంతే కాదు కీరవాణి కుమారుడు కాలభైరవతో పాటు నాటు నాటు సాంగ్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు . ఈ మేరకు అకాడమీ సభ్యులు అధికారికంగా ప్రకటన చేశారు . దీంతో సోషల్ మీడియాలో రాహుల్ సిప్లిగంజ్ పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది..!!

Share post:

Latest