ఆస్కార్ గెలుచుకున్న `నాటు నాటు` పాట‌కు రాహుల్ సిప్లిగంజ్ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా `నాటు నాటు` పాట మారుమోగిపోతోంది. `ఆర్ఆర్ఆర్‌` సినిమాలోని ఈ పాట ఇటీవల బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ సినిమా పాటగా `నాటు నాటు…` చరిత్ర సృష్టించింది. ఆస్కార్ వంటి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు రావ‌డంతో ఈ సాంగ్ క్రేజ్ మ‌రింత పెరిగిపోయింది.

ఇప్పటి వరకు భారతీయులు అందుకున్న ఆస్కార్ అవార్డులు అన్నీ హాలీవుడ్ సినిమాలు వచ్చినవే. దీంతో ఇండియాకు ఎప్ప‌టి నుంచో ఆస్కార్ ఆ క‌ల‌గా మిగిపోగా.. అది `ఆర్ఆర్ఆర్‌`తో సాకారం అయింది. `నాటు నాటు…` పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా… ఎంఎం కీరవాణి స్వరపరచిన గీతమిది. కీరవాణి తనయుడు కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఈ సాంగ్ ను ఆల‌పించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు.

పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు వేసి అద‌ర‌గొట్టారు. ఇప్పుడు ఈ పాటు ఆస్కార్ ద‌క్క‌డంతో డైరెక్ట‌ర్ నుంచి కొరియోగ్రఫ‌ర్ వ‌ర‌కు అంద‌రికీ ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కింది. ఇక‌పోతే వీరందరిలో సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఒక సాధారణ బార్బర్ ఆస్కార్ వరకు వెళ్ల‌డం ప్రశంసనీయం. ఈ నేప‌థ్యంలోనే రాహుల్ పై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ పాటకు రాహుల్ అందుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. రూ. 5 ల‌క్ష‌లు. నాటు నాటు పాట‌లో రామ్ చ‌ర‌ణ్‌ లిరిక్స్ ను ఆయ‌న పాడాడు. అందుకుగానూ ఐదు ల‌క్ష‌లు అందుకున్నారు. ఏదేమైనా ఆ సాంగ్ రాహుల్ కు తెచ్చిన గౌరవాన్ని డ‌బ్బుతో వెల‌క‌ట్టలేమ‌నే చెప్పాలి.