`ఆర్ఆర్ఆర్`పై నోరు జారిన త‌మ్మారెడ్డి.. రాఘ‌వేంద్ర‌రావు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్!

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` పాట ఆస్కార్ కు నామినేట్‌ అవడంతో.. రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్రస్తుతం అమెరికాలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ `ఆర్ఆర్ఆర్‌`పై నోరు జారారు.

`ఆర్ఆర్ఆర్‌ మూవీ టీమ్‌ ఆస్కార్ కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేసింది. ఆ 80 కోట్లు ఎదో మాకు ఇస్తే, 8 మీడియం బడ్జెట్ సినిమాలు తీసి మీ మొహం మీద కొడుతాము` అంటూ నోటి దురుసు చూపించారు. దీంతో త‌మ్మారెడ్డి వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌మ్మారెడ్డికి దిమ్మ‌తిరిగే కౌండ‌ర్ ఇచ్చారు.

`తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు ద‌ర్శ‌కుడికి, తెలుగు న‌టుల‌కు ప్ర‌పంచ వేదిక‌ల‌పై మొద‌టిసారి వ‌స్తోన్న పేరును చూసి గ‌ర్వ‌ప‌డాలి. అంతేకానీ 80 కోట్లు ఖ‌ర్చు అంటూ చెప్ప‌డానికి నీ ద‌గ్గ‌ర అకౌంట్స్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఏమైనా ఉందా. జేమ్స్ కామెరూన్‌, స్పీల్‌బ‌ర్గ్ వంటి వారు డ‌బ్బు తీసుకొని మ‌న సినిమా గొప్ప‌త‌నాన్ని పొగుడుతున్నార‌ని నీ ఉద్దేశ‌మా?` అంటూ రాఘ‌వేంద్ర‌రావు ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ్మారెడ్డికి స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. దీంతో నెట‌కిజ‌న్లు త‌మ్మారెడ్డికి స‌రిగ్గా బుద్ధి చెప్పారంటూ నెటిజ‌న్లు రాఘ‌వేంద్ర‌రావు ట్విట్ ను వైర‌ల్ చేస్తున్నారు.

Share post:

Latest