ఆ స్టార్ హీరోకి ఒక్కరు చాలరంట.. ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో…!!

ఈమధ్య కాలంలో ఇండస్ట్రీ లో సీనియర్ హీరోలకి హీరోయిన్లు దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లాంటి 50-60 ఏళ్లు ఉన్న హీరోలతో యంగ్ హీరోయిన్లు జతకట్టడానికి ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. అలా అని కొత్త వాళ్లను తీసుకురావాలంటే చాలా కష్టం. ఆల్రెడీ ఉన్న హీరోయిన్లు ఏమో సీనియర్ హీరోలకు సెట్ అవడంలేదు. దాంతో దర్శక నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉండగా ఒక సీనియర్ హీరోయిన్ తన కొత్త సినిమా కోసం ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ని రంగంలోకి దించుతున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరని అనుకుంటున్నారా? అతను మరేవరో కాదు విక్టరీ వెంకటేష్.

గత కొంతకాలంగా రీమేక్ సినిమాలలో నటిస్తూ మంచి హిట్లు అందుకుంటున్న వెంకటేష్ ఎక్కువ సినిమాలలో ఇద్దరు పిల్లల తండ్రి పాత్రలోనే కనిపిస్తున్నారు. తాజాగా ఇప్పుడు హిట్ ఫ్రాంచైజ్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ “సైంధవ్” అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర ఎలా ఉండబోతుందో అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకీ ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు ఒక్క హీరోయిన్ కూడా దొరక్క కొంతమంది సీనియర్ హీరోలు బాధపడుతుంటే, వెంకీ మామా మాత్రం ముగ్గురు హీరోయిన్లను రంగంలోకి దింపై అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అంతేకాకుండా యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న “సైంధవ్” సినిమాలో ముగ్గురు హీరోయిన్లకి చోటు ఎక్కడుందని కూడా అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ప్రేక్షకులతో పంచుకోనున్నారు.