అడ్డంగా బుక్కైన బ‌న్నీ.. ఆ విష‌యంలో ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన‌ `ఆర్ఆర్ఆర్‌` చిత్రం ఆస్కార్ అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన 95వ అకాడమీ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన `నాటు నాటు` పాట‌ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్‌ సహకారం చేసింది.

మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావ‌డంతో భార‌తీయ సినీ ప్రియులు సంబ‌రాల్లో మునిగిపోయారు. అలాగే మ‌రోవైపు ఆర్ఆర్ఆర్ టీమ్ కు మొత్తానికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా అభినంద‌న‌లు తెలిపారు.

కానీ, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం నోరు మెద‌ప‌లేదు. సోష‌ల్ మీడియా ద్వారా ఆర్ఆర్ఆర్ టీమ్‌పై అంద‌రూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తుంటే.. బ‌న్నీ క‌నీసం ఒక్క పోస్ట్ కూడా పెట్ట‌కుండా అడ్డ‌కంగా బుక్కైయ్యాడు. ఈ విష‌యంలో నెటిజ‌న్లు బ‌న్నీని ఏకిపారేస్తున్నారు. ఒక తెలుగు సినిమాకు మొద‌టిసారి ఆస్కార్ వ‌స్తే స్పందించేంత స‌మయం కూడా లేదా అంటూ బ‌న్నీపై కొంద‌రు ఫైర్ అవుతున్నారు. అభిమానులు సైతం `ఆర్ఆర్ఆర్‌`కు అభినంద‌న‌లు తెలుపుంటే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share post:

Latest