అసలు నువ్వు తల్లివేనా..? పబ్లిక్ లో నయన్ చేసిన పనికి ఛీ కొడుతున్న ఫ్యాన్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేసి ట్రోల్ చేసే జనాలు ఎక్కువ అయిపోయారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ఎప్పుడెప్పుడు చిక్కుతారా? వాళ్ళని ట్రోల్ చేద్దామా..? అంటూ కాచుకొని కూర్చున్నారు కొందరు ఆకతాయిలు. అలాంటి ట్రోలర్స్ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయింది సౌత్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార .

రీసెంట్ గానే కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ..పెళ్లయిన నాలుగు నెలలకే ఇద్దరు పండు లాంటి పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఈ క్రమంలోనే ఇదంతా సరోగసి ప్రాసెస్ ద్వారా జరిగింది అని తెలుసుకుని అభిమానులు షాక్ అయ్యారు . ఆ తర్వాత జరిగిన తతంగం అంతా మనకు తెలిసిందే . ఫైనల్లీ సరోగసి ప్రాసెస్ కి సంబంధించి లీగల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి పిల్లలను అఫీషియల్గా తమ పిల్లలుగా కన్ఫామ్ చేసుకున్నారు ఈ జంట .

రీసెంట్గా ఈ జంట పిల్లలని ఎత్తుకొని మీడియా కంట కనపడ్డారు. తాజాగా నయన్ విగ్నేష్ దంపతులు ముంబై ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చారు. దీంతో మీడియా వాళ్ళు కెమెరాలకు పని చెప్పారు. అయితే ఆ దంపతులు పిల్లల ముఖాలు కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే నయనతార వేసుకున్న ప్యాంట్ పై జనాలు హ్యుజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . ఇద్దరు పిల్లలకు తల్లైన నువ్వు ఇలా చిరిగిపోయిన ప్యాంట్ ని వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మండిపడుతున్నారు . అంతేకాదు నువ్వు తల్లివేనా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే నయనతార లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్ళు..!!

 

Share post:

Latest