నాగచైతన్య సక్సెస్ మొత్తం అరవింద్ స్వామి మీద నిలబడిందా..!!

ఒకప్పుడు హ్యాండ్సమ్ హీరోగా పేరు పొందిన అరవిందస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో రోజా, బొంబాయి వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే ఈ సినిమాల తరువాత అనుకున్నంత స్థాయిలో అరవిందస్వామి సక్సెస్ కాలేకపోయారు. దీంతో చాలాకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వ్యాపారాలను చూసుకుంటూ ఉండేవారు. అయితే ఆ తర్వాత తమిళంలో తని ఓరువన్ అని చిత్రంతో విలన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

Custody: Intriguing poster of Arvind Swamy revealed | 123telugu.com

ఈ సినిమాతోనే స్టైలిష్ విలన్ గా మారిపోయి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు.ఇక తర్వాత అరవిందస్వామి మరల నటుడుగా కూడా బిజీగా మారిపోయారు. ఇక తని ఓరువన్ చిత్రాన్ని తెలుగులో రీమిక్స్ చేసిన చిత్రం ధ్రువ. ఈ సినిమాలో కూడా అరవింద్ స్వామి విలన్ గా నటించి మెప్పించారు. అయితే ఈ సినిమా తర్వాత మరి తెలుగులో ఏ సినిమాలో కూడా నటించలేదు. తమిళంలో హీరోగా విలన్ గా నటిస్తున్న అరవింద స్వామి చాలాకాలం తర్వాత ఇప్పుడు నాగచైతన్య నటిస్తున్న కస్టడీ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తూ అన్నారు. ఈ సినిమా కూడా థ్రిల్లర్గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

Naga Chaitanya's next film 'Custody' to hit cinemas on May 12, 2023తాజాగా కస్టడీ సినిమా నుంచి అరవిందస్వామి కి సంబంధించి ఫస్ట్ లుక్కుని రివిల్ చేయడం జరిగింది. అయితే ఈ లుక్ చాలా న్యాచురల్ గా ఉందని మాట వినిపిస్తున్న సోషల్ మీడియాలో ధ్రువ సినిమా తరహాలో అరవింద స్వామి మెప్పించగలరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా నాగచైతన్య సక్సెస్ కూడా అరవింద్ స్వామి మీద ఆధారపడింది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి అరవిందస్వామి విలన్ గా ఎలా మెప్పిస్తారో చూడాలి మరి.

Share post:

Latest