మ‌రికొన్ని గంట‌ల్లో మంచు మ‌నోజ్ రెండో పెళ్లి.. దూరంగా మోహ‌న్ బాబు!?

మరికొన్ని గంటల్లో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా మార్చి 3వ‌ తేదీన మనోజ్ దివంగత‌ రాజ‌కీయ నాయ‌కుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ఏడడుగులు వేయ‌బోతున్నాడంటూ నెట్టింట గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

మనోజ్, మౌనికారెడ్డి ఇద్దరికీ ఇది రెండో వివాహమే. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి నివాసంలో మ‌నోజ్‌-మౌనిక పెళ్లి వేడుక జరగనుంద‌ని అంటున్నారు పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ‌ట‌. నిన్న మెహందీ వేడుకతో పెళ్లి సందడి మొదలు కాగా.. ఈరోజు సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నార‌ట‌. అయితే మ‌నోజ్ రెండో పెళ్లికి ఆయ‌న తండ్రి, డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు మ‌రియు అన్న మంచు విష్ణు దూరంగా ఉంటున్నార‌ని ఇన్‌సైడ్ టాక్ న‌డుస్తోంది.

భూమా మౌనికను మ‌నోజ్ వివాహం చేసుకోవ‌డం మోమ‌న్ బాబు, విష్ణుకు అస్స‌లు ఇష్టం లేద‌ట‌. భూమా మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి, తల్లి శోభా నాగిరెడ్డి కన్నుమూశారు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ టీడీపీలో ఉన్నారు. గ‌త ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ని చేసిన అక్క అఖిల ప్రియ.. ప్ర‌స్తుతం అనేక చిక్కుల్లో ఉంది. ఇక భూమా మౌనిక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడం వ‌ల్లే మోహ‌న్ బాబు మొద‌టి నుంచి ఆమె విష‌యంలో అస‌హ‌నంతో ఉన్నార‌ట‌. ఇక మ‌నోజ్ మ‌న‌సు మార్చుకోక‌పోవ‌డంతో.. మోహ‌న్ బాబు, విష్ణు అత‌డి పెళ్లికి దూరంగా ఉండాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఇక‌పోతే మ‌నోజ్ పెళ్లి బాధ్య‌త‌ల‌న్నీ మంచు ల‌క్ష్మినే ద‌గ్గరుండి చూసుకుంటోంది.