మెహ్రీన్ కౌర్.. ఈ ముద్దుగుమ్మ తెరపై కనిపించి చాలా కాలమే అయిపోయింది. `ఎఫ్ 3` తర్వాత మెహ్రీన్ నుంచి ఓ మూవీ రాలేదు. కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు లేవు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఈ బ్యూటీ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు, కాంగ్రెస్ నేత భవ్య బిష్ణోయ్ తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది.
భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా జరిగింది. కానీ, ఈ జంట పెళ్లి వరకు వెళ్లకుండానే విడిపోయారు. అధికారికంగా తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఇక ఆ తర్వాత మెహ్రీన్ కు ఆఫర్లు అంతంత మాత్రంగానే మారాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీ `స్పార్క్` అనే డబ్యూ హీరో మూవీలో నటించింది. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కి చాలా కాలమే అయినా.. ఇంత వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అసలు ఈ సినిమా ఉందో.. లేదో.. కూడా తెలియని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా మెహ్రీన్ షాకింగ్ లుక్ లో దర్శకనమిచ్చింది. కెరీర్ లో ఆరంభంలో బొద్దుగా, ఎంతో ముద్దుగా ఉన్న మెహ్రీన్.. ఇటీవల బాగా బరువు తగ్గింది. దీని కారణంగా ఆమె గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.
అసలు మునుపటి గ్లో ఆమె ముఖంలో ఏ మాత్రం కనిపించడం లేదు. అందుకు నిదర్శనం మెహ్రీన్ తాజాగా ఫోటోలే. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు వామ్మో.. మెహ్రీన్ ఇలా తయారైందేంటి? అంటూ ఆశ్చర్యపోతున్నారు.