పాపం ల‌య‌.. వారి చేతుల్లో అంత దారుణంగా మోస‌పోయిందా..?

ప్ర‌ముఖ న‌టి ల‌య గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ లో అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ‌.. కేవలం నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూర‌మైంది. ఫ్యామిలీతో అమెరికాలో స్థిర‌ప‌డ్డ ల‌య‌.. ఇటీవ‌లె ఇండియాకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంట‌ర్వ్యూలో భాగంగానే ల‌య ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నారు. అలాగే డ‌బ్బుల విష‌యంలోనే తాను చాలా మంది నిర్మాతల చేతుల్లో దారుణంగా మోస‌పోయానంటూ ప‌లు సంచ‌ల‌న నిజాల‌ను ల‌య బ‌య‌ట‌పెట్టారు. `మొదటి నుంచి కూడా నేను చాలా సాఫ్ట్. అందువలన చాలామంది డబ్బులు ఎగ్గొట్టారు.

మిగతా వాళ్లందరికీ డబ్బులు ఇచ్చేసి .. నాకు మాత్రం ఇచ్చేవారు కాదు. అలా చాలా సార్లు జరిగింది. మీరు గట్టిగా డబ్బులు అడిగితే ఇస్తారని నాతో ఇతర నటీనటులు అనేవారు. కానీ నేను మాత్రం గట్టిగా అడగలేక పోయేదాన్ని. కొందరు డబ్బులు ఇస్తేనే షూటింగ్ కి వస్తామని చెప్పేవారట, కానీ నేను మాత్రం అలా ఎప్పుడూ చెప్ప‌లేదు. ఇక కొంతమందేమో డబ్బులు అడిగితే నెక్స్ట్ ప్రాజెక్టులో చూద్దాం అనేవారు. ఆ త‌ర్వ‌త క‌నిపించేవారు కాదు` అంటూ ల‌య చెప్పుకొచ్చింది. మొత్తానికి డ‌బ్బుల విష‌యంలో త‌న‌ను చాలా మంది నిర్మాత‌లు మోసం చేశార‌ని ల‌య కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది.