అభిమానులకు మరో కిర్రాక్ న్యూస్ చెప్పిన ఆర్పి.. ఏం లక్ రా మావ నీది..!!

జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న కిర్రాక్ ఆర్పి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జబర్దస్త్ ద్వారానే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు కిర్రాక్ ఆర్పి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ జబర్దస్త్ నుండి ఆ తర్వాత వేరే షోస్ లో పాల్గొన్నాడు . ప్రజెంట్ ఆర్పి బిజినెస్ పరంగా ముందుకు వెళ్తున్నాడు. నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు అనే కర్రీస్ పాయింట్ను స్టార్ట్ చేసిన కిర్రాక్ ఆర్పి.. మంచి బిజినెస్ మ్యాన్ గా ముందుకు దూసుకెళ్తున్నాడు .

మంచి మంచి లాభాలతో కెరియర్లు సెటిలైపోతున్నాడు . ఈ క్రమంలోనే అప్పుడెప్పుడో ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్ధం చేసుకున్న కిరాక్ ఆర్పి..ఇన్నాళ్ళకి తన పెళ్లి పై స్పందించాడు . రీసెంట్గా మీడియాతో మాట్లాడిన కిర్రాక్ ఆర్పి.. తన పెళ్లి పై అఫీషియల్ ప్రకటన చేశాడు . ఈ క్రమంలోనే పనిలో పని తన లవ్ స్టోరీని కూడా బయట పెట్టేశాడు. కాగా లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయిని ప్రేమించిన కిరాక్ ఆర్పి ఇంట్లో పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పించినిశ్చితార్ధం కూడా చేసుకున్నాడు .

కాగా నిశ్చితార్ధం అయ్యి చాలా నెలలవుతున్న ఇప్పటివరకు ఈ జంట పెళ్లిపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో సోషల్ మీడియాలో వీళ్ళ గురించి హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. కాగా అమీర్ పేట్ లోని థర్డ్ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ఆర్పీ తన పెళ్లి పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ..” నాకు అబద్దాలు చెప్పడం రాదు ..ఉన్నమాట ఉన్నట్లు మాట్లాడేస్తా.. నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం ..అందుకోసమే ఆమె వెనక రెండేళ్లు పిచ్చి కుక్కల తిరిగాను.. ఫైనల్లీ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి ఒప్పించుకున్నాను. పెళ్లి చేసుకోబోతున్నాను నిశ్చితార్ధం అయిపోయింది .

నవంబర్ 29న గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతున్నాం. మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి ” అంటూ చెప్పుకు వచ్చాడు . ఇదే క్రమంలో లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ..” ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్ లో ఉన్నప్పుడు ఆర్పీ గెస్ట్ గా వచ్చారు. అక్కడ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది. మా పేరెంట్స్ ని పెళ్లికి ఒప్పించారు “అంటూ చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కానుంది . ఆర్పి ఓ ఇంటివాడు కాబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కంగ్రాట్యులేషన్స్ అంటూ విష్ చేస్తున్నారు..కొందరు ఏం లక్ రా మావ్ నీది అంటూ పొగిడేస్తున్నారు!!

Share post:

Latest