రామ్‌చరణ్‌ని ఘోరంగా అవమానించాలా.. ఇంత అసూయ ఎందుకు..??

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అతి కొద్ది సంవత్సరాల సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంత గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఇప్పటికీ ఒక సినిమా విషయంలో బాధ పడుతుంటాడట.

మగధీర లాంటి బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తరువాత ఆరంజ్ సినిమా చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా విషయంలో చరణ్ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాడట. ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మగధీర సినిమాను రీ రిలీజ్ చేయాలని భావించారట కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రానికి బదులుగా ఆరంజ్ సినిమాను విడుదల చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త విన్న చరణ్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచిన సినిమా ను విడుదల చేయడం చరణ్ ను అవమానించినట్లే అవుతుందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెర్రీ కి వచ్చిన మంచి పేరును చూసి ఓర్వలేక  ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేసి అతడిని తక్కువ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి ఆరంజ్ మూవీ కొంతకాలం ప్రేమికుడు అనే టాక్ తో వచ్చింది అయితే అప్పట్లో ఈ టైపు సినిమాలను ఆదరించేవారు తక్కువగా ఉన్నారు అందువల్ల మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. చెర్రీ పర్ఫామెన్స్, కామెడీ సాంగ్స్ స్టోరీ ఇవన్నీ కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్సే. అయినా కూడా అప్పట్లో ఫ్లాప్ అయింది. అని ఇప్పుడు రీ-రిలీజ్ చేస్తే ఈ సినిమా మంచి హిట్ కొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాని థియేటర్లలో మళ్లీ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. కానీ ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయాలని చూస్తున్నారు.

Share post:

Latest