ఏంటి ..నాగచైతన్య కూడా అలా చేస్తాడా..? ఇంతకన్నా దిగజారుడు తనం మరోకటి ఉంటుందా..?

సమంతతో విడాకులు తీసుకున్నప్పటినుంచి.. నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది . అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ..అక్కినేని నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగచైతన్య .. జోష్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదటి సినిమాతోనే యావరేజ్ రికార్డ్ అందుకున్న నాగచైతన్య .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ పర్లేదు అనే హీరో అనే విధంగా టాక్ సంపాదించుకున్నాడు.

రీసెంట్గా ఆయన చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది . అయితే ఈ సినిమా తర్వాత నాగచైతన్య..పరశురాం డైరెక్షన్లో ఓ సినిమాను చేయాల్సి ఉంది. కాగా కధ విన్న తర్వాత నాగచైతన్య సినిమాలో కొన్ని సీన్స్ మార్చాలని ..స్క్రిప్ట్ పరంగా సీన్స్ మారిస్తే సినిమాకి ఇంకా హైలైట్ గా ఉంటుంది అంటు సజిస్ట్ చేశారట.

దీంతో ఆ సినిమాను హోల్డ్ లో పెట్టిన్నట్లు తెలుస్తుంది . అయితే ఇష్టపడి రాసుకున్న సీన్స్ ..మార్చడం ఇష్టం లేక ..ప్రాజెక్టును వేరే హీరోతో ట్రై చేస్తున్నారట. ఈ క్రమంలో నే అక్కినేని హేటర్స్ ఆయనపై మండిపడుతున్నారు . ఏంటి నువ్వు కూడా కథలు విని సినిమాలు చూస్ చేసుకుంటున్నావా..? ఇప్పటివరకు నువ్వు తీసుకున్న సినిమాలలో కథ అనేది అసలు ఉందా ..? అంటూ ఆయన్ను ఏకీపారేస్తున్నారు . దీంతో నాగచైతన్య పరువు పోయిన్నట్లైంది..!!

 

Share post:

Latest