మోహ‌న్ లాల్‌తో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన హ‌నీరోజ్‌.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!

హ‌నీరోజ్.. ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `వీర సింహా రెడ్డి` సినిమాతో టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ భామ‌.. త‌న అందం, అభిన‌యంతో కుర్ర‌కారు గుండెల్లో గూడు క‌ట్టేసుకుంది. వీరసింహ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హనీరోజ్ పేరు నెట్టింట మారుమోగింది.

నిత్యం ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ అమ్మ‌డి డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది. ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా మారుతున్న హ‌నీరోజ్‌.. తాజాగా మజావిల్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్ 2022 వేడుకలో పాల్గొంది.

అలాగే డ్యాన్స్ ప‌ర్ఫామెన్స్ కూడా ఇచ్చింది. మ‌ల‌యాళ స్టార్ హీరో మోహన్ లాల్‏తో కలిసి హ‌నీ రోజ్ డ్యాన్స్ ఇర‌గ‌దీసింది. హ‌నీరోజ్‌ డాన్స్ ప్రాక్టిస్ వీడియోతో పాటు స్టేజీపై స్టెప్పులేసిన వీడియోను జత చేసి సోష‌ల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇప్పుడీ వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ తెగ ట్రెండ్ అవుతోంది. హ‌నీరోజ్ డ్యాన్స్ మ‌రియు ఆమె ఎక్స్‌ప్రెషన్స్ కు అభిమానుల‌తో పాటు నెటిజ‌న్లు కూడా ఫిదా అయిపోతున్నారు.