“ఇక మీదట అలా చేస్తే ఊరుకునేది లేదు”..సినిమా స్టార్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!!

ఇది నిజంగా సినిమా అభిమానులకు బిగ్ షాక్ అని చెప్పాలి. మనకు తెలిసిందే సినిమా స్టార్ సెలబ్రిటీస్ కేవలం సినిమాలో నటించి పారితోషకం తీసుకోవడమే కాదు.. పర్సనల్గా కూడా పలు బ్రాండ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసి అడ్వటైజ్మెంట్ చేసి కోట్లకు కోట్లు ఆస్తులు సంపాదించుకుంటారు .వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు మహేష్ బాబు . మహేష్ బాబు , అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ కూడా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ కోట్లకు కోట్లు చార్జ్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి స్టార్స్ కు కేంద్ర ప్రభుత్వం భారీ ఝలక్ ఇచ్చిందని చెప్పాలి .

రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల కష్టాలపై చలించిపోయి ఓ కీలక నిర్ణయం తీసుకుంది . ఇకపై బ్రాండెడ్ ఐటమ్స్ కి ప్రమోట్ చేసే విషయాలలో సెలబ్రిటీస్ జాగ్రత్తగా ఉండాలి అంటూ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది . డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఇన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై సెలబ్రిటీస్ ఏదైనా వస్తువుని లేదా సేవలను ప్రమోట్ చేయాలి అంటే దానిపే క్షుణ్ణంగా పరిశీలించి.. అది జనాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందో అని తెలుసుకున్న తర్వాత ప్రమోట్ చేయాలని ..అంతే కాదు వాటి ద్వారా ఎదురయ్యే అనుభవాలను తెలుపుతూ ప్రచారం చేయాలని పేర్కొంది.

అంతేనా చేసే ప్రచారం కూడా అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలి అంటూ కండిషన్ పెట్టింది . ఫోటో లేదా వీడియోల ద్వారా చేసే ప్రచారం స్పష్టంగా ఉండని పక్షంలో వాళ్లపై లీగల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరించింది . ఓ వస్తువులో లేని గుణాల గురించి చెప్పి ప్రచారం చేయడం నేరమని.. అలా చేసిన సెలబ్రిటీస్ ని కఠినంగా శిక్షిస్తామని చెప్పుకొచ్చింది. దాని ద్వారా జనాలను తప్పుదావ పట్టిస్తూ ప్రచారం చేసే పనిగా పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది . దీనితో బ్రాండెడ్ ఐటమ్స్ లో ప్రమోట్ చేసే వాళ్ళకి బిగ్ షాక్ తగిలినట్టు అయింది .

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో చాలామంది బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తారు. కానీ ఆ వస్తువులు ఏది వాళ్ళు యూస్ చేయరు. కేవలం జనాల కోసమే ..డబ్బుల కోసమే అలా ప్రమోట్ చేసి ఇలా తప్పించుకుంటారు . అయితే ఇక కేంద్ర ప్రభుత్వం పెట్టిన కొత్త కండిషన్స్ తో సెలబ్రిటీస్ బ్రాండ్ ఐటమ్స్ కూడా ప్రమోట్ చేయలేని విధంగా మారిపోయింది. దీంతో ఇది స్టార్ సెలబ్రెటీస్కు పెద్ద తలనొప్పిగా మారింది..!!